కాంగ్రెస్ తో జతకట్టిన చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీ...అదే పార్టీతో జత కట్టడం పై విపక్షాలతో పాటు స్వపక్షంలోని కొంతమంది టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విమర్శల దాడిలో తడిసి ముద్దవుతోన్న బాబుకు సుప్రీం కోర్టు తాజాగా దిమ్మదిరిగే షాకిచ్చింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన `ఓటుకు నోటు ` కేసును 2019 ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్ చేయాలని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం గురువారం నాడు ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలకుముందు ఈ కేసు విచారణకు రాబోతుండడంతో టీడీపీ వర్గాల్లో కలవరం మొదలైంది. అందులోనూ, కొంతకాలంగా పలు సంచలన తీర్పులను వెలువరుస్తోన్న సుప్రీం....ఈ కేసు విచారణ చేపట్టడంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటీవలికాలంలో పలు కీలక కేసుల తీర్పునిచ్చిన సుప్రీం...ఈకేసు వ్యవహారంలోకూడా సంచలన తీర్పు వెలువరించే అవకాశముందని టాక్ వస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ కేసు విచారణకు రానుండడంతో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓటుకు నోటు కేసు....దాదాపు మూడు సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసు. 2015 మే 30న అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి....50లక్షల డబ్బుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వైనం కలకలం రేపింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ విలువలు ఎంత దిగజారాయో సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైంది. ఇక, ఇదే కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు `ఫోన్ కాల్` ...`బ్రీఫ్డ్ మీ` వ్యవహారం....పెను దుమారం రేపింది. దేశరాజకీయాల్లో కలకలం రేపిన ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని, త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారంనాడు ఆ పిటిషన్ కు సంబంధించిన సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును 2019 ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్ చేయాలని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం గురువారం నాడు ఆదేశించింది. రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణా రెడ్డి పిటిషన్ వేశారని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ వినిపించిన వాదనను సుప్రీం పరిగణలోకి తీసుకోలేదు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం...పిటిషన్ ను టేకప్ చేసింది. అయితే, ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉంటాయని సిద్దార్థ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ మదన్ బీ లోకూర్.. ఆ విషయంలో తామేమీ చేయలేమని, ఫిబ్రవరిలో విచారణ జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ తీర్పుతో చంద్రబాబు మరింత ఇరకాటంలో పడ్డట్లయింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ కేసు విచారణకు రావడం....టీడీపీని ఇరకాటంలో పడేసినట్లయింది.