గణేష్ చతుర్థి వేడుకలపై సుప్రీం కీలక నిర్ణయం

Update: 2020-08-21 14:00 GMT
గణేష్ చతుర్థి వేడుకలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి, బహిరంగంగా గణేష్ చతుర్థి ఉత్సవాలను నిర్వహించ కూడదని ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశారు. తాజాగా సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలే చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రోజుల పాటు జైన దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు, గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించుకోవడానికి గానీ, ఏ ఇతర దేవాలయాలను తెరవడానికి నో చెప్పింది. జైన దేవాలయాలకు వర్తింపజేసిన కన్సెషన్లు.. వినాయక చవితి వేడుకలకు వర్తించబోదని స్పష్టం చేసింది. ఎక్కువమంది ఒకే చోట గుమ్మి కుడటానికి వీలులేదని తెలిపింది.

అయితే, జైనులు పరమ పవిత్రంగా భావించే పర్వ పర్యూషన్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. శని, ఆదివారాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ కారణంతో ఈ చివరి రెండు రోజుల పాటు వేడుకలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. ముంబైలోని దాదర్, బైకుల్లా, చెంబుర్‌ లల్లో గల జైన దేవాలయాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ పిటీషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె సారథ్యంలోని ముగ్గురు సభ్యులు ధర్మాసనం విచారణను నిర్వహించి , పిటీషనర్ల కోరిక మేరకు దాదర్, బైకుల్లా, చెంబుర్‌లల్లో గల జైన దేవాలయాల్లో పర్యూషన్ వేడుకలను నిర్వహించుకోవచ్చని ఎస్ ఏ బొబ్డే తీర్పు ఇచ్చారు

ఈ కండిషన్స్ ఏ ఇతర దేవాలయానికి గానీ, వినాయక చవితి ఉత్సవాలకు గానీ వర్తించబోవని స్పష్టం చేశారు. దీనికి ప్రధాన కారణం , భారీ సంఖ్యలో భక్తులు ఒకేచోటిెకి గుమికూడే అవకాశం ఉండటమే. వినాయక చవితి పండుగ సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించడానికి గానీ, గణేష్ చతుర్థి వేడుకలకు అనుమతి ఇవ్వడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేచోట గుమికూడుతారని , అలా జరిగితే కరోనా వ్యాపించే అవకాశం ఉందని , అందుకే అనుమతి ఇవ్వడంలేదని తెలిపింది.


Tags:    

Similar News