బాల‌కృష్ణ‌కు సుప్రీం నోటీసులు!

Update: 2022-08-29 11:53 GMT
టాలీవుడ్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు, ఏపీ ప్ర‌భుత్వానికి, తెలంగాణ ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బాల‌య్య‌తో పాటు ఏపీ ప్ర‌భుత్వానికి, తెలంగాణ ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయ‌డం ఏంటీ? .. దీని వెన‌కున్న అస‌లు కార‌ణం ఏంటీ అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. పంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 100వ మూవీ 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి'. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ 2017లో విడుద‌లైంది.

గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి బమోగ్ర‌ఫీగా తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రియ హీరోయిన్ గా న‌టించ‌గా అల‌నాటి డ్రీమ్ గాళ్, బాలీవుడ్ న‌టి హేమా మాలిని కీల‌క పాత్ర‌లో న‌టించారు. వై. రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు నిర్మించిన ఈ మూవీని 2017 జ‌న‌వ‌రి 12న సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఎపిక్ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ మూవీ కావ‌డం, చ‌రిత్ర‌క నేప‌థ్యంలో రూపొందిన సినిమా కావ‌డంతో ఈ మూవీకి ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప‌న్ను రాయితీని క‌ల్పించారు.

అయితే సినిమాకు ప‌న్ను రాయితీని తీసుకుని కూడా టికెట్ రేట్ల‌ని త‌గ్గించ‌లేద‌ని సినీ ప్రేక్ష‌కుల వినియోగ‌తారుల సంఘం సుప్రీం కోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని దాఖ‌లు చేసింది. ప‌న్ను రాయితీ ప్ర‌యోజ‌నాల‌ను ప్రేక్ష‌కుల‌కు బ‌ద‌లాయించలేద‌న త‌న పిటీష‌న్ లో పేర్కొంది.

దీంతో ప‌న్ను రాయితా పొందిన డ‌బ్బు మొత్తాన్ని ప్ర‌భుత్వానికి తిరిగి రిక‌వ‌రీ చేయాల్సిందిగా పిటీష‌న్ లో విజ్ఞ‌ప్తి చేసింది. ఈ కేసుని విచారించిన సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డి. వై. చంద్ర‌చూడ్ ధ‌ర్మాస‌నం హీరో బాల‌కృష్ణ స‌హా ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల‌కు నోటీసులు జారీ చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.    

ఇదిలా వుంటే 'అఖండ‌' సూప‌ర్ హిట్ తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన‌ నంద‌మూరి బాల‌కృష్ణ అదే ఊపుతో ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్ లో త‌న 107వ సినిమాని చేస్తున్నాను. హ‌నీరోజ్‌, శృతిహాస‌న్ హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలోని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ , దునియా విజ‌య్ న‌టిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News