జాగ్రత్త బాస్​.. కేబుల్​ బ్రిడ్జీ పై అడుగడుగునా నిఘా!

Update: 2020-10-04 09:30 GMT
హైదరాబాద్​ దుర్గంచెరువుపై ఇటీవల కేబుల్​ బ్రిడ్జీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విదేశీ టెక్నాలజీతో ఈ నిర్మాణం చేపట్టడంతో ఈ నిర్మాణం హైదరాబాద్​కే తలమానికంగా మారింది. ఈ కేబుల్​ బ్రిడ్జీని వీక్షీంచేందుకు యువత ఎగబడుతున్నారు. ఏ పని లేకపోయినా.. నగరం నలుమూలల నుంచి యువత ఇక్కడికి చేరుకొని సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ఇబ్బందులను చెక్​ పెట్టేందుకు జీహెచ్​ఎంసీ కేబుల్​ బ్రిడ్జీపై నిరంతర నిఘా పెట్టింది.

ఎవరైనా అనవసరంగా ఎక్కువ సేపు వాహనాలు ఆపితే.. వారికి జరిమానా వేస్తున్నారు. రాత్రి సమయంలో కేబుల్ బ్రిడ్జీ లైటింగ్స్​ ధగధగలతో మెరిసిపోతోంది. దీన్ని వీక్షించేందుకు యువత ఎగబడుతున్నారు. వంతెనపై వాహనాలు నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని దాంతో పాటూ ప్రమాదాలకు అవకాశాలున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  దీంతో వంతెనపై వాహనాలు నిలపకుండా జీహెచ్‌ఎంసీ నిషేధం  విధించింది. అయినప్పటికీ తీరు మారకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులు  సోషల్‌ మీడియా వేదికగా వినూత్న ప్రచారం చేపట్టారు. ‘బిగ్​బాస్​ చూస్తున్నాడు జర భద్రం’ అంటూ సోషల్​మీడియాలో ప్రచారం చేస్తున్నారు. బ్రిడ్జిపై వాహనాలు నిలిపి అనవసరంగా చలానాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. గతనెల 25న మంత్రి కేటీఆర్‌ ఈ బ్రిడ్జిని ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇక్కడ జనం హంగామా మొదలైంది.
Tags:    

Similar News