ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల ప్రమాదాలకు కారణం ఏమిటన్న అంశాన్ని పరిశీలిస్తున్న అధికారులు కొత్త అంశాన్ని గుర్తించారు. రోడ్ల ప్రమాదాలు గురవుతున్న వారి వయసుతో పాటు.. వారు వాడుతున్న వాహనం లెక్కను బయటకు తీసి అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా వారో ‘కొత్త’ విషయాన్ని గుర్తించారు.
రాష్ట్రంలో జరిగే ప్రమాదాల్లో ఎక్కువ భాగంగా కొత్త వాహనాలే కారణంగా తేల్చారు. మొత్తం ప్రమాదాల్లో సగం.. కొత్త వాహనాల పుణ్యమేనని గుర్తించారు. ఐదేళ్ల లోపు వాహనాలే ఎక్కువగా ప్రమాదానికి కారణంగా తేల్చారు. తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రోడ్డు భద్రత విభాగం ఈ కొత్త గణాంకాల్ని వెల్లడించాయి. కొత్త వాహనం కావటంతో దూసుకెళ్లి పోతున్న వాహనదారులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు.
2019లో తెలంగాణ వ్యాప్తంగా 21,570 ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో ఐదేళ్ల లోపు వయసున్న వాహనాల సంఖ్య 44.4 శాతం ఉండటం గమనార్హం. 5-10 ఏళ్ల లోపు వాహనాల కారణంగా ప్రమాదాలు 24.8 శాతంగా తేల్చారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో ఐదేళ్ల లోపు వాహనాల కారణంగా మరణించిన వారు 43.8 శాతం మంది ఉండగా.. 5-10 ఏళ్ల లోపు వాహనాల కారణంగా మరణించిన వారు 29.5శాతంగా చెబుతున్నారు. అంటే.. కొత్త వాహనం కావటంతో దూసుకెళ్లే అవకాశం ఉండటం..నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం.. మితిమీరినవేగం కూడా ప్రమాదాలకు కారణాలుగా తేల్చారు. ఏమైనా.. ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో కొత్త కోణం బయటకు వచ్చిందని చెప్పాలి.