సూర్య.. సూర్య.. సూర్య.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లో మార్మోగుతున్న పేరు. సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాడు మాకూ ఉండాలి.. అని ప్రతి జట్టు కోరుకుంటున్నవాడు. ఇన్నాళ్లూ చూసిన టి20 బ్యాటింగ్ వేరు.. ఇప్పుడ చూస్తున్నది వేరు అన్నట్లుగా చెలరేగిపోతున్నాడు. అసలింతకూ ఇతడి స్టామినా రహస్యం ఏమిటి? అదీకాకుండా సూర్య టీమిండియాలోకి రావడం ఎందుకు ఆలస్యమైంది..? శుబ్ మన్ గిల్, ప్రథ్వీ షా, వాషింగ్టన్ సుందర్ వంటివారు 18 ఏళ్లు, 17 ఏళ్లకే టీమిండియాకు ఆడితే, సూర్యకుమార్ లాంటి ప్రతిభావంతుడికి 31 ఏళ్ల దాకా ఎందుకు అవకాశం రాలేదు..? దీనికి ఎన్నో సమాధానాలు..
రంజీల్లో అదరగొట్టినా..
ప్రస్తుతం సూర్యకుమార్ వయసు 32 ఏళ్ల 117 రోజులు. అతడి ప్రతిభ చూస్తుంటే పదేళ్ల కిందటే అతడు టీమిండియాలోకి వచ్చి ఉండాల్సింది. కానీ, 2021 మార్చి 21న టి20ల్లోకి, ఈ ఏడాది జూలైలో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా టెస్టులే ఆడలేదు. మరోవైపు వన్డేల్లో అతడి స్థానం ఖరారు కాలేదు. శ్రేయస్ అయ్యర్ వంటి వారి నుంచి తీవ్ర పోటీ ఉంది. అసలు సూర్య టీమిండియాలోకి రావడం ఎందుకింత ఆలస్యమైంది...? అంటే అనేక ప్రశ్నలు. సూర్య ఫస్ట్ క్లాస్ కెరీర్ మొదలైంది 2010 ప్రారంభంలోనే. అంటే 13 ఏళ్ల కిందట. అప్పటికి అతడికి 18-19 ఏళ్లు. ముంబైకి చెందిన సూర్యకు తీవ్ర పోటీ కారణంగా అక్కడి రంజీ జట్టులో చోటు దక్కడమే గగనమైపోయింది. అయితే, క్రమంగా కుదురుకున్నాడు.
ఆల్ రౌండరా? బ్యాట్స్ మనా?
సూర్య రంజీల్లో మంచి ప్రతిభే చూపినా.. అది టీమిండియా స్థాయికి సరిపోలేదు దీనికితోడు సూర్య స్పెషలిస్టు బ్యాట్స్ మనా? మీడియం పేస్/ఆఫ్ బ్రేక్ స్పిన్ వేసే ఆల్ రౌండరా? తేల్చుకోలేని పరిస్థితి. రెండింటికీ అతడు కొన్నిసార్లు న్యాయం చేయలేకపోయేవాడు. అలాఅలా సంవత్సరాలు గడిచిపోయాయి. సూర్యకు 30 ఏళ్లు దాటాయి. అయితే, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున చెలరేగడం అతడి పేరు మార్మోగేల చేసింది. దీంతో టీమిండియాలోకి ఎంట్రీకి వైల్డ్ కార్డు లభించింది.
సెలక్షన్ కమిటీ వైఫల్యమే..?
సూర్యకుమార్ లాంటి ప్రతిభావంతుడిని టీమిండియాలోకి ఆలస్యంగా తీసుకోవడం సెలక్షన్ వైఫల్యమేనని చెప్పాలి. అసాధారణ ప్రతిభ ఉన్న సూర్యలాంటివారిని గుర్తించి మెరుగైన శిక్షణతో రాటుదేలేలా చేసి జట్టులోకి ఎంపిక చేయాల్సిన బాధ్యత సెలక్షన్ కమిటీ, బీసీసీఐది. ఈ పాత్రను పోషించడంలో అవి విఫలమయ్యాయి. అందుకే టి20ల్లో మన జట్టు వెనుకబడిపోతోంది. కాగా, ప్రస్తుతం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తరహా 360 డిగ్రీల ఆటతో సూర్య ప్రపంచ క్రికెట్‌లో పెన సంచలనంగా మారాడు.ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయ్యాడు.
ఆలస్యమైనా.. అదరహో..
సూర్య కెరీర్ మరో ఐదారేళ్లు కొనసాగొచ్చు. కాగా, అంతర్జాతీయ అరంగేట్రం ఆలస్యంగా జరిగినా అది తనలో ఆకలి పెంచిందని అంటున్నాడు అతడు. ఎక్కువ దేశవాళీ క్రికెట్ ఆడడం మంచి చేసిందని.. ముంబయికి ఆడడం ఎంతో ఆనందాన్నిచ్చిన విషయమని చెబుతున్నాడు. టీమిండియాకు ఆడినప్పుడు ఎంత ఆస్వాదించాడో, ముంబైకూ అదే స్థాయిలో ఆస్వాదించానని పేర్కొంటున్నాడు. జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం కొంచెం కష్టంగా అనిపించినా.. అప్పుడు ఆడుతున్న మ్యాచ్ ప్రాధాన్యాన్ని గుర్తించి ఆడేవాడినని ఆట పట్ల ఉత్సాహమే తనను నడిపించిందని వివరిస్తున్నాడు.
ఒత్తిడి మంచికే.. ఇంకోలా ఆలోచిస్తా
‘‘ఒక మ్యాచ్‌కు సన్నద్ధమయ్యేటపుడు మన మీద మనం ఒత్తిడి పెంచుకోవడం అవసరమే. ఒత్తిడి ఎంత ఎక్కువైతే అంత మెరుగైన ప్రదర్శన చేస్తాం. నా ఆట వెనుక చాలా కష్టం దాగుంది. నా ప్రాక్టీస్ సెషన్లు తీవ్రతతో సాగుతాయి. వికెట్ల వెనుక బౌండరీల దూరం అటు ఇటుగా 60 మీటర్లే ఉంటుంది. అందుకే అటువైపు బంతిని బాదడానికి ప్రయత్నిస్తా. నా ఇన్నింగ్స్‌ల్లో ఏది ఉత్తమమైంది అంటే ఏదో ఒకట ఎంచుకోవడం కష్టమే. నేను కఠిన పరిస్థితుల్లో బరిలోకి దిగి బాగా ఆడిన ఇన్నింగ్స్‌లన్నీ ఇష్టమే. గత ఏడాది కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడా. ఇప్పుడు అదే ప్రదర్శనను కొనసాగిస్తున్నా. క్రీజులోకి అడుగు పెట్టి ఆస్వాదిస్తూ ఆడడం నాకిష్టం. మామూలుగా కఠిన పరిస్థితుల్లో జట్లు మ్యాచ్ మీద ఆశలు వదులుకుంటాయి. కానీ నేను మాత్రం అప్పుడే అసలు కథ మొదలైందని అనుకుంటా. నేను బాగా ఆడి, జట్టుకు మంచి జరిగితే సంతోషమే’’ అని సూర్య చెబుతున్నాడు.
ఆట తక్షణం మార్చుకోవాల్సిందే.. ఇంటికెళ్లినా దాని గురించే ‘‘టీ20 ఫార్మాట్లో కొన్ని షాట్లు ముందే అనుకుని ఆడాల్సి ఉంటుంది. నేను అలా ఆడే షాట్లు ఉన్నాయి. కానీ బంతిని బట్టి, బౌలర్‌ను బట్టి.. ఫీల్డింగ్ స్థానాలను అనుసరించి అప్పటికప్పుడు సర్దుబాట్లు చేసుకుని ఆడాల్సిన అవసరం పడుతుంది. అన్ని షాట్లూ ఆడాల్సి ఉంటుంది. ఎక్కువసార్లు నేను గ్యాప్ చూసి షాట్లు ఆడతా. మైదానాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటా. ద్రవిడ్ నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. నా సహజ శైలిలో ఆడమని అంటాడు. నేను ఇప్పుడు కొత్తగా ఏ షాట్లూ ఆడట్లేదు. కొన్నేళ్ల నుంచి ఆడుతున్నవే కొనసాగిస్తున్నా.
నా క్రికెట్ ప్రయాణంలో నా కుటుంబానిది ముఖ్య పాత్ర. నేను క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన కొత్తలో మిగతా వారికి భిన్నమైన కెరీర్ ఎంచుకున్నప్పటికీ ప్రోత్సాహం అందించారు. మా నాన్న ఇంజినీర్. క్రీడలతో ఆయనకు సంబంధమే లేదు. నాలోని క్రికెట్ మెరుపును గుర్తించి నడిపించారు. నా కోసం అమ్మ, నాన్న ఎన్నో త్యాగాలు చేశారు. నా భార్య కూడా గొప్ప ప్రోత్సాహం అందించింది. నేను ఇంటికి వెళ్లినా ఆట గురించి, పోషకాహారం గురించి, మెరుగవడం గురించే మాట్లాడతా’’అని బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.