సుష్మాస్వరాజ్... బీజేపీ మోస్ట్ సీనియర్ టీంలో ఒకరు. ప్రస్తుతం విదేశాంగ శాఖ నిర్వహిస్తున్న సుష్మాస్వరాజ్ బీజేపీలో చాలాకీలక పాత్ర పోషించారు. ప్రధాని అవుదామని ప్రణాళికలు వేసినా అవి తీరం చేరలేదు. అయినా, వివాదాలకు పోకుండా సర్దుకుపోతున్నారు. తాజాగా బీజేపీ తరఫున తెలంగాణలో ప్రచారం చేయడానికి వచ్చారు. సోనియాగాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను విమర్శించారు.
బలిదానాలు - త్యాగాల ద్వారా తెలంగాణ వచ్చిందని... ఎంత మంది దుఃఖం - ఎంత మంది శ్రమ - ఎంత మంది త్యాగం... కేవలం కేసీఆర్ కుటుంబం అనుభవిస్తుందని సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీగా మారిన తెలంగాణ గురించి సోనియాలాగ బాధపడను - కేసీఆర్ పై పోరాడుతాను - చెలరేగిపోయి విముక్తి కల్పిస్తాను అని శపథం చేశారావిడ. తెలంగాణ అమరవీరులను గుర్తించేందుకు కూడా టీఆర్ ఎస్ పార్టీ నిరాకరించిందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ తన హామీలను నెరవేర్చలేదని ఆమె మండిపడ్డారు. అందుకే తెలంగాణ ఎన్నికలు అబద్ధానికి- నిజానికి మధ్య జరుగుతున్న పోరాటంగా సుష్మ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించకుంటే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. అంత పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడితే ఇక్కడి యువతకు ఉద్యోగాలు మాత్రం ఇప్పటికీ దక్కలేదు. దీనికి కేసీఆర్ బాధ్యుడు అని అన్నారు. ఆమె కాంగ్రెస్ - టీడీపీ పొత్తు కూడా స్పందించారు. ఆ పొత్తు సంకరం అని - అనైతికమని ఆవిడ వ్యాఖ్యానించారు. వారి కూటమిని ప్రజలు నమ్మరని సుష్మ వ్యాఖ్యానించారు. బీజేపీ చాలా ఆశలతో పెద్దలందరూ వచ్చి తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆ పార్టీ సింగిల్ నెంబరు దాటితే బీజేపీకి అది అతిపెద్ద విజయం కానుందని విశ్లేషకులు అంటున్నారు. మరి కచ్చితంగా హంగ్ వస్తుందని - తాము కీలకం అవుతామన్న ఆశతోనే ఈ పెద్దలంతా తెలంగాణ చుట్టూ తిరుగుతున్నట్టు ఉన్నారు.