కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె పార్టీ నుంచి వీడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై జగన్ పార్టీ రియాక్ట్ అయ్యింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భూమా ఇష్యూ మీద పార్టీ తరఫున భూమా బావమరిది స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ వెళ్లిపోవటం లేదని.. అలా జరుగుతున్నదంతా ఉత్త ప్రచారం తప్ప మరేమీ లేదని వ్యాఖ్యానించారు.
గత రెండు రోజులుగా భూమా అండ్ కో జగన్ పార్టీ నుంచి వీడిపోతున్నారని.. ఏపీ అధికారపక్షానికి వెళ్లిపోతున్నట్లుగా వార్తలు ఊపందుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సైతం తమ అంతర్గత సంభాషణల్లో భూమా బ్యాచ్ వెళ్లిపోతున్నట్లుగా చెప్పటం గమనార్హం. ఈ వార్తలకు తగ్గట్లే కర్నూలు జిల్లాలోని భూమా ఇంటి మీద నిన్నటి వరకూ రెపరెపలాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా.. శుక్రవారం నుంచి కనిపించకపోవటానికి సంబంధించి ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు.
భూమాతో పాటు.. ఆయన కుమార్తె అఖిల ప్రియ.. మరో ఇద్దరు వరకూ ఎమ్మెల్యేలు జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవటం ఖాయమంటున్నారు. బావ నిష్క్రమణను ఖండించిన బావ మరిది ఎస్వీ మోహన్ రెడ్డి సైతం పార్టీలోనే కొనసాగుతారా? లేక.. బావ వెంటనే వెళతారా? అన్నది ఒక ప్రశ్న. భూమా సతీమణి దివంగత శోభానాగిరెడ్డి సొంత బ్రదరే.. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్న విషయం మర్చిపోకూడదు. ఏమైనా.. బావ భూమా గురించి బావమరిది ఎస్వీ చెప్పిన మాట ఎంతవరకు నిజమన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.