స్వామీజీ ఆత్మహత్య కేసు: ఫోన్లు చేసిన ఆ లేడీ ఎవరు? సూసైడ్ నోట్ పేజీ మాయం?

Update: 2022-10-25 16:30 GMT
ప్రముఖ మఠాధిపతి ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన స్వామీజీ ఉదయం అదే గదిలో శవమై కనిపించారు.  గదిలోని కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఇది ఆత్మహత్యనా? హత్యనా? అన్న కోణంలో అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు మూడు పేజీల డెత్ నోట్ రాశారని పోలీసులు అంటున్నారు.

ఆ వివరాలు మాత్రం బయటకు చెప్పలేదు. అయితే స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు ఐదు పేజీల డెత్ నోట్ రాశారని.. అందులో మొదటి పేజీ, చివరి మూడు పేజీలు పోలీసులకు చిక్కాయని.. మధ్యలో మరోపేజీ మాయం అయ్యిందని లీక్ కావడం సంచలనమైంది.

బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని మాగడి తాలూకాలో కంచుగల్ బండే మఠం ఉంది. కుంచుగల్ బండే మఠం మఠాదిపతిగా బసవలింగ స్వామీజీ(45) పనిచేస్తున్నారు. కంచుగల్ బండే మఠానికి రామనగర జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో మంచి పేరుంది. ఇటీవల కంచుగల్ బండే మఠం 25వ వార్షికోత్సవం మఠాధిపతి బసవలింగ స్వామీజీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు. భక్తుల చేత మంచి పేరును స్వామీజీ సంపాదించారు. నిత్యం సమాజసేవ చేస్తూ భక్తులకు దగ్గరయ్యాడు.

రాత్రి మఠంలోని తన గదిలోకి వెళ్లిన బసవలింగ స్వామీజీ ఉదయం అదే గదిలో ఆత్మహత్య చేసుకొని శవమై కనిపించడంతో మఠంలోని భక్తులు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్వామీజీ బసచేసే గదిలో ఆత్మహత్య చేసుకునే ముందు 3 పేజీల డెత్ నోట్ రాశారని పోలీసులు అన్నారు. డెత్ నోట్ లోని వివరాలను పోలీసులు బయటకు చెప్పలేదు. 3 పేజీల లేఖలో మధ్య పేజీ మాయం అయ్యిందని పోలీసులు గుర్తించడం హాట్ టాపిక్ గా మారింది. డెత్ నోట్ లో ఓ మహిళ పేరు ప్రస్తావించారని.. ఆమె టార్చర్ ఎక్కువైందని స్వామీజీ డెత్ నోట్ రాశారని ప్రముఖ కన్నడ టీవీ న్యూస్ చానల్ వార్తలు ప్రసారం చేసింది. గుర్తు తెలియని మహిళతోపాటు కొందరు వ్యక్తులు ఫోన్లు చేసి వేధింపులకు గురిచేయడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారని తెలుస్తోంది.

స్వామీజీ డెత్ నోట్ లో పేజీ మిస్ కావడం.. ఒక లేడీ ఆయనకు తరచూ ఫోన్లు చేసి వేధించినట్టు తేలడం.. తనను హింసిస్తున్నారని మొదటి పేజీలో ఉండడంతో ఈ కేసులో ఏదో మతలబు ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆ డెత్ నోట్ ను బయటపెడితే కానీ పూర్తి వివరాలు తెలియవు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News