ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గి తమను మోసం చేస్తోందంటూ డెలివరీ బాయ్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్విగ్గి కంపెనీ యాజమాన్యం, తమకు కమిషన్ తక్కువగా ఇస్తుందని , మధ్యవర్తులకి కమిషన్ ఎక్కువగా ఇస్తూ తమ పొట్టకొడుతుంది అని మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. గతంలో 2 కిలోమీటర్ల పరిది లోపు ఒక డెలివరీ చేస్తే .. 35 రూపాయల కమిషన్ ఇస్తున్న స్విగ్గీ ప్రస్తుతం భారీగా కోత విధించిందని, ఒక కిలోమీటర్ పరిదిలో ఫుడ్ డెలివరీ చేస్తే కేవలం 6 రూపాయలు మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్విగ్గీ కంపెనీ యాజమాన్యం థర్డ్ పార్టీ ని పెట్టి , థర్టీ పార్టీకి ఎక్కువ కమిషన్ ఇస్తూ తమకు మాత్రం తక్కువ కమిషన్ ఇస్తుందని స్విగ్గీ డెలివరీ బాధితులు చెప్తున్నారు.
రోజుకి 200 సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. థర్టీ పార్టీకి ఎక్కువ కమిషన్ ఇస్తూ తమకు మాత్రం తక్కువ కమిషన్ చెల్లిస్తోందని, తమను మోసం చేస్తున్న స్విగ్గి కంపెనీపై మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన స్విగ్గి ప్రతినిధులు రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామినిచ్చారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకుంటే హైదరాబాద్ మొత్తం ఆందోళనలు చేస్తామని స్విగ్గి డెలివరీ బాయ్స్ తెగేసి చెప్పారు.