కొన్నిసార్లు అంతే. కంటెంట్ కు ఢోకా ఉండదు కానీ.. రావాల్సినంత పేరు రాదు. ఫోకస్ ఉండదు. సినిమాలు కానీ.. రాజకీయాలు కానీ ఇలాంటి పరిస్థితి ఉంటుంది. టైమింగ్.. వేదిక.. ఇలాంటివన్నీ కూడా కీలకంగా మారుతుంటాయి. కొన్నిసార్లు విడుదలయ్యే సినిమాలు చాలా బాగున్నా.. టైమ్లీగా లేకపోవటం కారణంగా రావాల్సినంత కలెక్షన్లు రాకుండా బాక్సులు వెనక్కి వెళ్లిపోతుంటాయి.
ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్న ఎన్నికల వేళ.. కొందరు నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడినప్పటికీ.. వాటికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకుండా ఉంటాయి. తాజాగా అలాంటివి వ్యాఖ్యలే కొన్నింటిని కొందరు ప్రముఖ నేతల చేశారు. అలాంటి వ్యాఖ్యల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తాజా పంచ్ మాట చూస్తే.. కేటీఆర్.. తరచూ ఢిల్లీ మెడలు వంచుతామని అంటుంటారు. ఢిల్లీ అంటే మీ బావ హరీశ్ రావు అనుకుంటున్నారా? అంటూ అదిరిపోయే పంచ్ వేశారు.
హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో మోడీ ప్రసంగానికి ముందు మాట్లాడిన లక్ష్మణ్ ఈ భారీ వ్యాఖ్యను చేశారు. ఆయనే కాదు.. మరికొందరు నేతలు సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్.. కేంద్రంలో కారు.. ముందు తెలంగాన డబుల్ బెడ్రూం ప్రాజెక్టు.. ట్యాంక్ బండ్ క్లీనింగ్.. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో చక్రం తిప్పాలన్నారు. పదహారు ఎంపీ సీట్లు వస్తే చాలు.. ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెప్పే కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ గా కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే రీతిలో హైదరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ భగవంతరావు మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ డబుల్ బెడ్రూం పార్టీ. అంతా కుటుంబ పాలనే అంటూ ఎద్దేవా చేశారు. అదెలానంటే.. బాపు.. బేటా.. బేటీ.. హరీశ్ అంటూ ఆయన మండిపడ్డారు. ఇలా కేసీఆర్ పైన పలువురు చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ గా ఉన్నా.. ప్రముఖంగా వీరి వ్యాఖ్యలు మీడియాలో రాకపోవటంతో ఫోకస్ కాలేదని చెప్పాలి.