వైసీపీలో చేరికలు.. అక్కడ ఆంక్షల్లేవు..

Update: 2019-06-18 08:33 GMT
వైసీపీ అధినేత జగన్ నీటి పాలిటిక్స్ అంటూ ముందుకు వెళుతున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచి అధికారం చేపట్టగానే 23 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీని కకావికలం చేసే చాన్స్ ఉన్న జగన్ ఆ పనిచేయలేదు. బాబు ప్రతిపక్ష హోదాను పడగొట్టలేదు. అలా చేస్తే బాబుకు, నాకు తేడా లేదంటూ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు. రాజీనామా చేసి వస్తేనే టీడీపీ నేతలను తీసుకుంటామంటూ ఆదర్శంగా నిలిచారు.

అయితే రాష్ట్రమంతా ఒక ఎత్తు.. ఆ జిల్లాలో మాత్రం మరో ఎత్తు అని వైసీపీ భావిస్తోంది. అందుకే టీడీపీ కంచుకోటలో మాత్రం ఈ ఫిరాయింపులను ప్రోత్సహించుడే అన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.

తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 20 నుంచి ఏ పార్టీ నాయకుడైనా వైసీపీలో చేరొచ్చు అని.. వైసీపీ తలుపులు తెరిచే ఉంటాయని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ మొదట తాడిపత్రి నియోజకవర్గ నేతలకే అని ట్విస్ట్ ఇచ్చాడు. అనంతపురంలో వైసీపీని బలోపేతం చేయడానికి ఇది తప్పనిసరి అని తేల్చాడు..

అనంతపురం రాజకీయాలను అనాదిగా టీడీపీ తరుఫున జేసీ ఫ్యామిలీ - పరిటాల ఫ్యామిలీ ఏలుతోంది. జేసీ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరడం.. పరిటాల సునీత కూడా ఆది నుంచి టీడీపీలో ఉండడంతో వారిని ఢీకొని వైసీపీ ఈ సారి నిలబడింది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 12 గెలిచి సత్తా చాటింది. వైసీపీ ధాటికి జేసీ వారసులు - పరిటాల శ్రీరామ్ ఓడిపోయాడు. బలమైన వీరిని ఆపడం ఎల్లకాలం కష్టమే. అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు ఫ్యామిలీలను ఎదగనీయకుండా చేయాలంటే వైసీపీ బలోపేతం చేయాలి. అందుకే అనంతపురం జిల్లాలో మాత్రం వలసలను ప్రోత్సహించడమే కరెక్ట్ అని తాడిపత్రి ఎమ్మెల్యే స్పష్టం చేశారు. లేకుంటే వైసీపీ ఎదగదంటున్నాడు. మరి వైసీపీ అధిష్టానం ఈ విషయంలోఎలా ముందుకు వెళుతుందనేది వేచిచూడాలి.


Tags:    

Similar News