తేజోమ‌హ‌ల్ కాదు..తాజ్ మ‌హలే

Update: 2018-02-22 12:36 GMT
తాజ్ మ‌హ‌ల్ పై కొత్త‌వివాదం తెర‌పైకి వ‌చ్చింది.  తాజ్ మ‌హ‌ల్ సమాధి కాదని, ‘తేజోమహాలయ్‌’ పేరుతో ఉన్న శివాలయమని వాద‌న‌లు గ‌త కొద్దికాలంగా వినిపిస్తున్నాయి. అయితే కాన్పూర్  బీజేపీ ఎంపీ విన‌య్  క‌తియార్ తాజ్ మ‌హ‌ల్ నిర్మాణంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తేజో మ‌హ‌ల్ గా ఉన్న శివాల‌యాన్ని కూల్చేసిన షాజ‌హాన్ తాజ్ మ‌హల్ నిర్మించార‌ని అన్నారు. అంతేకాదు తాజ్ మ‌హ‌ల్ ను హిందువులే నిర్మించారు. కాబ‌ట్టి..తాజ్ మ‌హ‌ల్ ను తేజో మందిర్  గా పేరు మారుస్తామ‌ని చెప్పుకొచ్చారు.

ఈ నేప‌థ్యంలో ఆగ్రా కోర్టులో కేంద్ర  పురావ‌స్తు శాఖ‌(ఏఎస్ ఐ) అఫిడ‌విట్ ను దాఖ‌లు చేసింది.  తాజ్‌ మహల్‌  మొఘల్‌ చక్రవర్తి షాజహాన్ - ఆయన భార్య ముంతాజ్‌ ల స‌మాధే  తప్ప శివాలయం కాదని పురావస్తు శాఖ  తేల్చిచెప్పింది.

ప్రపంచపు ఏడు వింతలలో ఒకటి అయిన తాజ్ మహల్ ను - మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన  భార్య ముంతాజ్ మహల్ పైన ఉన్న ప్రేమకు గుర్తుగా - ఆమె సమాధిని ఆగ్రా లో నిర్మించారని వెల్ల‌డించింది. అంతేకాదు వేలాది మంది క‌ళాకారులు 21 సంవ‌త్స‌రాల పాటు ఈ తాజ్ మ‌హ‌ల్ నిర్మించార‌ని ఏఎస్ ఐ తరఫు న్యాయవాది అంజనీ శర్మ అఫిడవిట్‌లో తెలిపారు.  1632 లో ప్రారంభించి 1653 లో పూర్తి చేశార‌ని .అది సమాధి కాదని - ‘తేజోమహాలయ్‌’ పేరుతో ఉన్న శివాలయమని చేస్తున్న వాదనలు ఊహాజనితమని పేర్కొన్నారు. తాజ్‌ దేశ సంస్కృతీ చిహ్నమని, దీన్ని పేరు మార్చడం వారసత్వ సాంస్కృతిక చరిత్రను కాలరాయడమే అవుతుందని ఏఎస్ఐ పేర్కొంది.
Tags:    

Similar News