ఇంటర్మీడియట్ కాలేజీల తీరుపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్యూషన్ పీజులు చెల్లించేవరకు సర్టిఫికెట్లు ఇచ్చేది లేదంటూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడే కాలేజీలపై కోరాడ జులిపించనున్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న జూనియర్ కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ డీజీపీకి లేఖ రాశారు.
రాష్ట్రంలో పలు కాలేజీ యాజమాన్యాలు అదనపు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, ఇంటర్ సర్టిఫికెట్లతో పాటు పదో తరగతి సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వకుండా వేధిస్తున్న కాలేజీ యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలని లేఖలో డీజీపీని కోరారు. జూనియర్ కాలేజీ యాజమాన్యాల తీరుతో విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోంది.
ఉన్నత చదువులు చదవాలనుకునేవారికి సకాలంలో సర్టిఫికెట్లు రాక నానా అవస్థలు పడుతున్నారు. ఐఐటీల్లో సీట్లు పొందిన చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కాలేజీ యాజమాన్యాల తీరుతో సకాలంలో సర్టిఫికెట్లు పొందలేకపోతున్నామని తమ దృష్టికి తీసుకొచ్చినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ పేర్కొన్నారు. కాబట్టి అలాంటి కాలేజీ యాజమాన్యాలపై సత్వరం చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు.