ఆగిన రథ చక్రాలు..ఏపీలో మోగిన ఆర్టీసీ సమ్మె సైరన్

Update: 2022-02-01 16:34 GMT
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది.  ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు కూడా ప్రకటించారు.

ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక మెమోరాండం సమర్పించింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును కలిసి తాము సమ్మె విషయంపై మెమోరాండం అందించినట్లు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు వెల్లడించారు.

ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఎండీకి అందించామన్నారు. తమ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని మెమోరాండంలో పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెళతామని ఎండీకి తెలిపారు.

తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళతామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు స్పష్టం చేశారు.

ఇటు ప్రభుత్వ ఉద్యోగులు..అటు ఆర్టీసీ సమ్మెతో కార్మికులు సమ్మె చేస్తే ఆ ప్రభావం భారీగా పడడం ఖాయం. ఆర్టీసీ బస్సులు ఆగిపోతే ప్రయాణికులు ఇబ్బంది పడుతారు. ఆ ప్రభావం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుంది.  
Tags:    

Similar News