త‌ల‌సాని ఎన్నిక‌ల‌ స‌వాల్‌ కు రేవంత్ స్పందిస్తారా?

Update: 2017-05-28 09:31 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు రేవంత్ రెడ్డికి ఊహించ‌ని స‌వాల్ ఎదురైంది. సంద‌ర్భం ఏదైనా దూకుడుగా ఉండే రేవంత్‌కు ఆయ‌న ఇలాకాగా భావిస్తున్న ప్రాంతం నుంచే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు చాలెంజ్ విసిరారు. ఇంత‌కీ ఆ స‌వాల్ ఏంటంటే....ఉప ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డితో బ‌రిలో దిగేందుకు తాను సిద్ధ‌మ‌ని, త‌న‌తో పోటీ ప‌డే ధైర్యం రేవంత్‌కు ఉందా అని ప్ర‌శ్నించారు.

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్‌ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ కానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో వికారాబాద్ జిల్లాలోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి రేవంత్ పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలాఉంటే...తాజాగా వికారాబాద్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ టీటీడీపీనేత‌ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. గొల్ల కురుమ బహిరంగ సభకు స‌హ‌చ‌ర‌ మంత్రులు జూపల్లి కృష్ణారావు,మహేందర్ రెడ్డితో హాజ‌రైన త‌ల‌సాని ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చ‌రించారు.  తెలిపారు. త‌మ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసేముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఏపీలో ఏం జ‌రుగుతుందో చూసుకోవాల‌ని అన్నారు.

త‌న‌పై వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేస్తున్న రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే ప్ర‌త్య‌క్షంగా ఎదుర్కోవాల‌ని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ స‌వాల్ విసిరారు. ``ఇద్దరం రాజీనామా చేసి మళ్లీ పోటీ చేద్దాం. ఇందుకోసం నేను ఎమ్మెల్యేగా ఉన్న సనత్ నగర్ అయినా ఓకే...నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న కొడంగల్ అయినా ఓకే. బ‌రిలోకి దిగి చూసుకుందాం`` అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే స్పందించాల‌ని లేక‌పోతే నోరు మూసుకోవాల‌ని వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News