రాజకీయ నాయకుడు అంటే చాలు.. వైట్ అండ్ వైట్ లో కనిపించటం.. దానికి ఖద్దర్ ను జత చేయటం కనిపిస్తుంది. పొలిటికల్ లీడర్స్ అన్న వెంటనే వైట్ అండ్ వైట్ లోనే కనిపిస్తారు. దీనికి చంద్రబాబు కాస్త భిన్నంగా పసుపు లుక్ మిస్ కాకుండా జాగ్రత్త పడతారు. వీరికి భిన్నంగా ఏపీ విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెష్ అధినేత వైఎస్ జగన్ బ్లూ కలర్ చొక్కాల్ని వేస్తూ కనిపిస్తారు. ఇంతకు మించి.. మిగిలిన ముఖ్యనేతలంతా వైట్ అండ్ వైట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.
అలాంటి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా యూత్ లుక్ తో అదరగొట్టేశారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశానికి బ్లూకలర్ టీషర్ట్ కు బ్లాక్ కలర్ డిజైన్ తో ఉన్న షర్ట్ వేసుకొని కాస్త భిన్నంగా దర్శనమిచ్చారు. నిత్యం వైట్ అండ్ వైట్ లో కనిపించే తలసాని.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా కలర్ ఫుల్ టీ షర్ట్ వేసుకొని కనిపించటం కాస్త కొత్తగా ఉంది. ఆయన తాజాగా టీ షర్ట్ లో కాస్త యూత్ లుక్ లో దర్శనమివ్వటం విశేషంగా మారింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన శాఖకు సంబంధించి ఈ నెల 24 నుంచి 27 వరకు రామోజీ ఫిలింసిటీలో ఇండీవుడ్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి కలర్ ఫుల్ టీ షర్ట్ తో రావటం గమనార్హం. పలువురు సినీ ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో.. తలసాని టీ షర్ట్ తో రావటం సమ్ థింగ్ స్పెషల్ గా నిలిచారు.