ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహనరెడ్డి చేపట్టనున్న సుదీర్ఘ పాదయాత్రకు రంగం సిద్ధమైంది. ఓ మహా సంకల్పంతోనే జగన్ ' ప్రజా సంకల్పం' పాదయాత్ర నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత - జగన్ పాదయాత్రకు రూట్ మ్యాప్ ప్లానర్ తలశిల రఘురామ్ తెలిపారు. జగన్ పాదయాత్రకు సమయం సమీపిస్తున్న తరుణంలో నిన్నటిదాకా పాదయాత్ర రూట్ మ్యాప్ రూపకల్పనలో పూర్తిగా నిమగ్నమైన తలశిల... కాసేపటి క్రితం విజయవాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అసలు జగన్ చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్ర లక్ష్యం - యాత్ర విశేషాలను రఘురాం వివరించారు.
ఈ నెల 6వ తేదీన ఉదయం 9 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద జగన్ నివాళులర్పిస్తారని.. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి పాదయాత్ర ప్రారంభిస్తారని రఘురామ్ చెప్పారు. కడప జిల్లాలో 7 రోజులపాటు మొత్తం వంద కిలోమీటర్లు యాత్ర కొనసాతుందని తెలిపారు. పులివెందుల - కమలాపురం - జమ్మలమడుగు - ప్రొద్దుటూరు - మైదుకూరు నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని వెల్లడించారు. ఆ తర్వాత కర్నూలు - అనంతపురం - చిత్తూరు - నెల్లూరు జిల్లాల నుంచి కొనసాగుతూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్పం పాదయాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు. 13 జిల్లాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తారని.. ప్రజలందరినీ ఆయన కలుస్తారని రఘురామ్ తెలిపారు.
గతంలో వైఎస్సాఆర్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తయ్యాయని.. ఇప్పడు కూడా శాంతియుత వాతావరణంలోనే కొనసాగుతుందని ఆయన నమ్మకం వెలిబుచ్చారు. అయితే ప్రభుత్వం యాత్రకు అవరోధాలు కల్పించాలని చూస్తోందని రఘురామ్ ఆరోపించారు. జగన్ పాదయాత్ర విజయవంతం అయితే తమ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడట్లేనన్న భయంతో తెలుగుదేశం నేతలు కుట్రలకు తెరలేపుతున్నారన్నారు. పాదయాత్ర ప్రాధాన్యం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని.. వాటిని తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు రఘురాం పిలుపునిచ్చారు.
పాదయాత్ర చేసేందుకు అనుమతులు అవసరం లేదని రఘురాం అన్నారు. ముద్రగడ పద్మనాభం యాత్రతో ప్రజా సంకల్ప యాత్రకు సంబంధం లేదని.. ముద్రగడ చేపట్టింది కాపు హక్కుల పోరాటమని చెప్పారు. ప్రతిపక్ష నేతగా - వైఎస్ జగన్ ప్రజా హక్కుల కోసం.. వారి సమస్యలు వినిపించేందుకు పాదయాత్ర చేపట్టబోతున్నారని తెలిపారు. జననేతకి స్వాగతం పలికేందుకు రాష్ట్రంలోని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రఘురామ్ ఆరోపించారు. రాష్ట్రాభివద్ధి జగన్ లక్ష్యమని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ హయాంలోని స్వర్ణయగం తిరిగి తెచ్చేందుకే ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని రఘురామ్ స్పష్టం చేశారు.