పాక్ పెంచి పోషించిన ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశాన్ని కబళించేందుకు రెడీ అవుతోంది. ఓవైపు పాకిస్థాన్ ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుండగా మరోవైపు తాలిబన్లు పాక్ లోని భూభాగాలను కైవసం చేసుకునే ప్లాన్ చేస్తుంది. దీంతో తాలిబన్లకు.. పాకిస్థాన్ సైనికుల మధ్య కొద్దిరోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు వెళ్లిన వెంటనే తాలిబన్లు అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్ ను చేజించుకోవడం వెనుక పాక్ సహకారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ను పూర్తిగా తన కబంధ హస్తంలోకి తీసుకున్న తాలిబన్ల కన్ను ప్రస్తుతం పాకిస్తాన్ పై పడినట్లు కన్పిస్తోంది.
గతంలో సోవియట్ సైన్యంపై అప్ఘాన్ తాలిబన్లతో కలిసి పోరాటానికి గూఢచార సంస్థ ఐఎస్ఐ సృష్టించిన తాలిబన్లు ఇప్పుడు పాక్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. పాక్ తాలిబన్లు.. తెహ్రీకే తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) సంస్థ చత్రం కింద పని చేస్తున్నారు. అయితే గతేడాది ఆగస్టులో పాక్ భూభాగంలోకి అమెరికన్ డ్రోన్ కాబుల్ అల్ ఖైదీ ఐమాన్ అల్ జవహరిని హతమార్చింది.
ఈ క్రమంలోనే పాక్-అప్ఘన్ మమధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్లోని ఖైబర్ ఫఖ్తూన్ క్వా.. బలూచిస్థాన్ రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతున్నాయి. పాక్.. అప్ఘన్ మధ్య 2వేల640 కిలోమీటర్ల మేర బ్రిటిష్ వలస పాలకులు గీసిన డ్యూరాండ్ సరిహద్దు రేఖను ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు ప్రస్తుతం అంగీకరించడం లేదు.
ఖైబర్.. ఫఖ్తూన్ క్వాలోని పష్తూన్ ప్రాంతాలు పాక్ ఏలుబడిలోకి వెళ్లాయని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. ఈ భూభాగాలు తమకే చెందుతాయని వాదిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు కంచెను తాలిబన్లు చాలా చోట్ల తొలగిస్తున్నారు. ఈ డిసెంబరులో బలుచిస్థాన్ లోని చమన్.. అఫ్గాన్ లోని స్పిన్ బోల్డాక్ కూడలిలో పాక్ సైనికులు సరిహద్దు కంచెకు మరమ్మతు చేయడానికి ప్రయత్నించారు.
ఈ సమయంలో తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు పాక్ పౌరులు చనిపోయారు. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.ఆప్ఘన్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తమ చెప్పు చేత్లలో ఉంచుకోవాలని పాక్ ప్రభుత్వం ఇస్లామిక్ స్టేట్ ఆప్ ఖొరసాన్ వంటి ఉగ్రవాద సంస్థలను ఉసి గొల్పుతోంది.
దీనికి దీటుగా ఆప్ఘన్ మద్దతు కలిగిన టీటీపీని పాక్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలు ఉసిగొల్పుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య పరస్పర ఉగ్ర దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఇస్లామాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో టీటీపీ కారు బాంబు పేల్చగా ఒక పోలీస్ అధికారితో పాటు పది మంది ప్రజలు గాయపడ్డారు.
ఈ క్రమంలోనే డిసెంబ్ 20 పాక్ కమాండోలో బన్నూపై దాడి చేసి 25 మంది టీటీపీ ఉగ్రవాదులను హతమర్చారు. ఈ నెల మొదటి వారంలో కాబుల్ లోని పాక్ రాయబార కార్యాలయంపై ఉగ్రవాది జరిగింది. ఈ పరిణామాలు చూస్తుంటే అఫ్గన్ గడ్డపై పాక్ ప్రతినిధుల రక్షణను తాలిబన్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అర్థమవుతుంది. అమెరికా అప్ఘన్ నుంచి వెళ్లిపోతే ఆ దేశం తమ చేతుల్లో ఉంటుందని భ్రమించిన పాకిస్థాన్ కు తాలిబన్లు క్రమంగా పాక్ లోనూ విస్తరిస్తుండటం మింగుడు పడటం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.