అమెరికాకు తాలిబన్ల హెచ్చరిక.. డెడ్ లైన్

Update: 2021-08-24 09:30 GMT
అప్ఘనిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడి ప్రజలు ఆ దేశం నుంచి ఎప్పుడు బయటపడాలా..? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భారత్, అమెరికా దేశాలు దేశం విడిచి వెళ్లదలచుకున్నవారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు. అయితే అప్ఘాన్, విదేశీ పౌరులను అక్కడి నుంచి తరలించేందుకు ముందుగా విధించిన గడువు సరిపోదని అమెరికా ఇటీవల స్పష్టం చేసింది. దీంతో పౌరులను తరలించేందుకు మరికొంత గడువు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అయితే తాలిబన్లు మాత్రం ససెమిరా అంటున్నారు. గడువులోగా మీ పౌరులను తరలించుకోవాలని గడువు తరువాత అమెరికాకు చెందిన ఏ ఒక్కరు కనిపిపంచినా పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

దాదాపు 15 రోజుల కిందట అమెరికా తమ బలగాలను అప్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంటామని ప్రకటించింది. అలాగే తాలిబన్లు దేశాన్ని ఆక్రమించబోతున్నారని, 90 రోజుల్లో దేశాన్ని ఆక్రమించుకుంటారని చెప్పింది. అయితే అమెరికా ఊహించింది జరగలేదు. కేవలం వారం రోజుల్లోనే తాలిబన్లు అప్ఘనిస్తాన్ ఆక్రమించారు. ఈ తరుణంలో అమెరికా తన సైన్యాన్ని సొంతగడ్డకు తరలించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ దేశాన్ని విడిచిపెట్టాలనుకున్నవారికీ సాయం చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 28 వేల మందిని కాబుల్ నుంచి తరలించింది.

అయితే మొత్తం 60 వేలకు పైగా పౌరులను అమెరికాతో పాటు మిత్ర దేశాలకు చెందిన వారిని  తరలించాలని  లక్ష్యంగా పెట్టుకుంది.  అయితే ఈనెల 31 వరకు  ఇంతమందిని తరలించడం సాధ్యం కాదని తెలిపింది. అంతేకాకుండా విదేశీయులు ధ్రువపత్రాలను పరిశీలించేందుకు సమయం సరిపోవడం లేదంటోంది.  అందువల్ల ముందుగా నిర్ణయించిన గడువు ఈనెల 31 వరకు అది సాధ్యం కాదని, మరింత గడువు పెంచుకొని పౌరులను తరలిస్తామని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద 5800 మంది అమెరికా బలగాలు మోహరించాయి. ఇదిలా ఉండగా ఇలాంటి విషయాలను చర్చించేదుకు  జీ7 దేశాలు అత్యవసరంగా సమావేశం కావాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ సూచించారు.  అయితే ఈ ప్రకటనపై తాలిబన్లు స్పందించారు. గడువులోగా అమెరికా తమ పౌరులను తరలించుకోవాలని లేకుంటే ఇక్కడ పర్యావసనాలు తప్పవని హెచ్చరించింది. ఆగస్టు 31 వరకే వారి డెడ్ లైన్ అని ప్రకటించారు.  ఈ సందర్భంగా తాలిబన్లకు చెందిన కొందరు ముఖ్య నాయకులు వీడియో ద్వారా తెలిపారు.

అమెరికాతో పాటు భారత్ దేశీయులతో పాటు అప్ఘాన్ వాసులను ఇక్కడికి రప్పిస్తుంది. ఇప్పటికే అధికారులు, సైన్యంతో పాటు సాధారణ పౌరులను వందలకొద్దీ ఇక్కడికి తీసుకొచ్చింది. ఇంతకుముందే అత్యవసర వీసా ప్రవేశపెడుతున్నామని ఇప్పటికే ప్రకటించింది.  తాజాగా  300కు పై పౌరులకు భారత్ కు తీసుకొచ్చింది. మరింత మందిని అత్యవసర వీసా ద్వారా తరలిస్తామని విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రకటించారు. నిత్యం రెండు విమానాల ద్వారా ప్రయాణికులను తీసుకొస్తామంటున్నారు. మరోవైపు అప్ఘనిస్తాన్ లో నెలకొన్న సంక్షోభంపై నేడు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రతిపక్షాలకు కూడా ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో అప్ఘనిస్తాన్లో నెలకొన్ని పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రతిపక్షాల నుంచి సలహాలు తీసుకోనున్నారు. తాము చేయబోయేది ఆయా పార్టీల నాయకులకు చెప్పనున్నారు.

ఇక అప్ఘనిస్తాన్ లో  మొదట శాంతి మంత్రం పలికిన తాలిబన్లు ఆ తరువాత రెచ్చిపోతున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని విచక్షణ రహితంగా కాల్చిపారేస్తున్నారు. మహిళలను ఉద్యోగాలకు  వెళ్లనివ్వడం లేదు. వాస్తవానికి వచ్చే నెలలో తాలిబన్ల పాలన ప్రారంభం కానుంది. కానీ కిందిస్థాయి నాయకులు ఇప్పటికే తమ ఆడగాడలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే తమ పాలన అంతకుముందులాగా ఉండదని, ప్రజాస్వామ్యం సృష్టిస్తామని అంటున్నారు. కానీ కింది స్థాయి నాయకులు మాత్రం రెచ్చిపోతున్నారు.
Tags:    

Similar News