మొదలైన తాలిబన్ల వేట

Update: 2021-08-22 03:36 GMT
దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు మూడోరోజు నుండి తమ వేటను మొదలుపెట్టారు. కీలకమైన ఆఫీసులను, రాయబార కార్యాలయాలతో పాటు ఇళ్ళలో వెతుకులాట ప్రారంభించారు. గడచిన 20 ఏళ్ళుగా తమకు వ్యతిరేకంగా ఆప్ఘనిస్ధాన్ ప్రభుత్వానికి, అమెరికాతో పాటు నాటో దళాలకు సహకరించిన ఆఫ్ఘన్ల కోసం వేట మొదలెట్టారు. తాలిబన్ల దెబ్బకు ఇప్పటికే అమెరికా, భారత్ తో పాటు చాలా దేశాలు తమ రాయబార కార్యాలయాలను ఖాళీ చేసేశాయి.

రాయబార కార్యాలయాలు ఖాళీ చేయటంతో పాటు రాయబారులతో పాటు అత్యున్నత స్ధాయి అధికారులు, ఉద్యోగుల్లో చాలామంది తమ క్వార్టర్స్ ను ఖాళీ చేసి తమ దేశాలకు వెళిపోయారు. అలా ఖాళీ అయిపోయిన కార్యాలయాలను, క్వార్టర్స్ లో  తాలిబన్ దళాలు వెతుకులాట మొదలుపెట్టాయి. తమకు వ్యతిరేకంగా వివిధ దేశాలు, ఉన్నతాధికారులు ఏవైనా డాక్యుమెంట్లు తయారు చేశారా ? లేకపోతే అందుకున్నారా అనే విషయాల కోసం వెతుకుతున్నారు.

ఇక తమకు వ్యతిరేకంగా గడచిన 20 ఏళ్ళల్లో వ్యతిరేకంగా పనిచేసిన మిలిట్రీ, పోలీసు అధికారుల జాబితాలను దగ్గర పెట్టుకుని మరీ గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కాందహార్, హెరాత్, కాబూల్, జలాలాబాద్ నగరాల్లో వేట మొదలైంది. పనిలో పనిగా వారికి సహకరించిన మామూలు జనాల కోసం కూడా ఇల్లిల్లు గాలిస్తున్నారట. తాలిబన్ల జాబితా ప్రకారం తమకు వ్యతిరేకంగా పనిచేసిన ఉన్నతాధికారులు, మిలిట్రీ, పోలీసు ఉన్నతాధికారులతా పాటు మామూలు జనాలు సుమారు 50 వేలమందున్నారట.

తాలిబన్ల జాబితాలో ఉన్నవారిలో ఎంతమంది ఆప్ఘనిస్ధాన్లో ఉన్నారో ఎంతమంది దేశం విడిచిపారిపోయారు ఎవరికీ తెలీదు. తాలిబన్లకు దొరికితే తమను బతకనీయరన్న ఉద్దేశ్యంతోనే ఎవరికి అందుబాటులో ఉన్న మార్గాల్లో దేశం విడిచి ప్రాణభయంతో వేలాదిమంది పారిపోతున్నారు. దేశప్రజలకు ప్రాణభిక్ష పెడుతున్నట్లు ప్రకటించిన మరుసటి రోజునుండే వేట మొదలుపెట్టడంతో తాలిబన్లను ఎవరు నమ్మటంలేదు. దొరికిన వాళ్ళను తాలిబన్లు చివరకు ఏమి చేస్తారనే టెన్షన్ అయితే పెరిగిపోతోంది.
Tags:    

Similar News