గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పుట్టి పెరిగిన ఇల్లును ఒక నటుడు ఛేజిక్కించుకున్నారు. ఆయన పేరు మణికందన్. అతడు నటుడు నిర్మాత కం రియల్ ఎస్టేట్ వ్యాపారి. పిచాయ్ ఈ ఇంట్లోనే పుట్టి పెరిగారని తెలుసుకుని ఎంతో గౌరవపూర్వకంగా అభిమానంతో ఆ ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. తాజా కథనాల ప్రకారం... సుందర్ పిచాయ్ పూర్వీకుల ఇంటిని అతని తండ్రి పూర్తిగా పడగొట్టారు. ఆ ఖర్చులన్నిటినీ ఆయనే భరించాడు. విల్లాను అభివృద్ధి చేయడానికి ఆ స్థలాన్ని మణికందన్ కు అప్పగించారని తెలిసింది.
మణికందన్ కోలీవుడ్ లో స్మాల్ టైమ్ నటుడు. నిర్మాతగాను పలు సినిమాలు నిర్మించారు. ఈ ఆస్తి కొనుగోలు ప్రాసెస్ లో సుందర్ పిచాయ్ తల్లిదండ్రుల వినయవిధేయతలపై మణికందన్ ప్రశంసలు కురిపించారు.
సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ తయారు చేసి ఇచ్చారని.. అతని తండ్రి మొదటి మీటింగ్ లోనే భూమి తాలూకా పత్రాలను అందించారని తెలిపారు. వారి వినయపూర్వకమైన విధానం చూసి ఆశ్చర్యపోయాను! అని మణికందన్ అన్నారు.
సుందర్ పిచాయ్ తండ్రి ఓపికగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గంటల తరబడి వేచి ఉండి అవసరమైన అన్ని పన్నులు చెల్లించి ఆపై పత్రాలను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. మణికందన్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అని తన బ్రాండ్ చెల్లప్పాస్ బిల్డర్స్ కింద ఇప్పటికే దాదాపు 300 ఇళ్లను నిర్మించి డెలివరీ చేశారని కూడా తెలుస్తోంది.
సుందర్ పిచాయ్ సాధించిన విజయాలను చూసి ముగ్ధులవ్వడమే కాకుండా దేశానికి గూగుల్ CEO చేసిన సేవలను గౌరవించాలనే కోరికతో అశోక్ నగర్ ఆస్తిని కొనుగోలు చేయాలని మణికందన్ భావించారట. రిజిస్ట్రేషన్ లేదా బదిలీ ప్రక్రియను వేగవంతం చేయడానికి తన కొడుకు పేరును ఉపయోగించవద్దని సుందర్ పిచాయ్ తండ్రి పట్టుబట్టారని కూడా మణికందన్ ప్రస్తావించారు.
చెన్నైలో పుట్టి పెరిగిన సుందర్ పిచాయ్ 1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజినీరింగ్ చదవడానికి నగరాన్ని విడిచి వెళ్లారు. సుందర్ పిచాయ్ తండ్రి తమ పాత ఇంటిని పడగొట్టారు.. ఇది అతని మొదటి ఆస్తి కాబట్టి మానసికంగా కదిలించిందని కూడా తమిళ మీడియాలు పేర్కొన్నాయి. మణికందన్ ఆ స్థలంలో ఒక విల్లాను నిర్మించాలని యోచిస్తున్నాడు. వచ్చే ఏడాదిన్నరలోగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.