డెబ్భయి అయిదు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది.. ఆ ఆసుపత్రిలోనే కన్నుమూసిన జయలలిత మృతితో తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. ప్రస్తుతానికి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిని చేసినా ఆయన పదవి ఎన్నాళ్లుఉంటుందో... ఎప్పుడు ఏమొస్తుందో అన్నట్లుగా అక్కడి రాజకీయ పరిణామాలు ఉన్నాయి. పన్నీర్ కు ముఖ్యమంత్రి పదవి.. అన్నాడీఎంకే పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను జయలలిత మిత్రురాలు శశికళకు అప్పగించిన విషయం తెలిసిందే. కానీ.. జయలలిత మృతి చెందారన్న వార్తను దాచి పలువురు రాజకీయాలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీలో విభేదాలు చెలరేగుతున్నాయని, నాయకత్వం విషయంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవడం ఆసక్తి రేపుతోంది.
జయలలిత కన్నుమూసిన నాలుగు రోజులకే గవర్నరు .. రాజ్ నాథ్ ను కలవడం పట్ల అందరి దృష్టి ఇప్పుడు వారిపైనే పడింది. రాజ్‌నాథ్‌ను విద్యాసాగర్ రావు ఎందుకు కలిశారు? ఏ అంశంపై చర్చ జరుగుతోంది? అన్న ఆసక్తి నెలకొంది. వారిద్దరి మధ్య ప్రధానంగా తమిళనాడు వ్యవహారాలపైనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైను సీఎం చేయాలని బీజేపీ అనుకున్నట్లు ఒక ప్రచారం ఉంది. శశికళ కూడా సీఎం కావాలనుకుంటున్నారని సమాచారం. అయితే.. జయ మరణించిన వెంటనే తాను సీఎం పదవి చేపడితే జనం ఆమోదించకపోవచ్చన్న సంశయంతో ఆమె పన్నీర్ కు ఓకే చెప్పినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో బీజేపీ జోక్యం పెరుగుతోంది. ఒకప్పుడు బీజేపీలో కీలక నేతగా, ఎన్డీయే ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన విద్యాసాగరరావు తమిళనాడుకు గవర్నరుగా ఉండడం.. ఆయన హోం మంత్రి రాజ్ నాథ్ తో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి పెంచుతోంది.