ప్లాస్టిక్ భూతంపై కీలక నిర్ణయం

Update: 2018-06-05 10:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్లాస్టిక్ భూతంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ప్లాస్టిక్ వల్ల భూమిపై ఎంత అనర్థాలు జరుగుతున్నాయో.. పశుపక్ష్యాదులకు - పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందనే దానిపై అందరిలోనూ సామాజిక సృహ పెరుగుతోంది.

తాజాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2019 జనవరి 1 నుంచి  తమిళనాడు రాష్ట్రంలో  పూర్తిగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం ఫళని స్వామి ప్రకటించారు. సోమవారం ఈ మేరకు ఆయన ప్రకటన జారీ చేశారు. ప్లాస్టిక్ ఉత్పత్తులను ఇక నుంచి తమిళనాడులో తయారు చేయడం... వాడటాన్ని ఆయన నిషేధించారు.

రాష్ట్ర శాసనసభలో ఫళనిస్వామి ఈ మేరకు ప్రకటించారు. అయితే పాలు - అయిల్ ఫౌచ్ లు - మెడికల్ యుటిలిటీస్ - ఇతర ప్రాథమిక ఉత్పత్తులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు నిస్తున్నామని సీఎం  తెలిపారు. రూల్ 110 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు..

కాగా గుజరాత్ రాష్ట్రం కూడా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ప్రజారవాణా మార్గాలు - గార్డెన్లు - ప్రభుత్వ ఆఫీసుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నేటినుంచే నిషేధిస్తున్నట్లు  ఉత్తర్వులు జారీ చేసింది. 
Tags:    

Similar News