ఓవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేసిన ఉదంతంలో బీజేపీకి చెందిన మధ్యవర్తులు రంగంలోకి దిగటం.. ఆ కుట్రను విజయవంతంగా చేధించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సక్సెస్ కావటం.. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను ఈ మధ్యన విడుదల చేయటం తెలిసిందే. తీవ్ర సంచలనంగా మారుతుందని భావించిన ఈ ఎపిసోడ్ ను పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. కేసీఆర్ సర్కారు మీద సరికొత్త ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి. వీటిపై మీడియాలో ప్రాధాన్యత లభించనప్పటికీ.. తెర వెనుక మాత్రం పెద్ద ఎత్తున అలజడి మొదలైనట్లుగా చెబుతున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే తనకు అందిన ఫిర్యాదులను పట్టుకొని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లినట్లుగా ప్రచారం సాగుతోంది. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీఅయిన తమిళ సై.. దీనికి సంబంధించిన వివరాల్ని.. సమాచారాన్ని ఇచ్చి ఉంటారని చెబుతున్నారు. తెలంగాణలో ప్రతిపక్ష నేతలు.. ఇతర ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న ఫిర్యాదుల పరంపరను ఆయన వద్దకు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని.. దీనికి పోలీసులు సహకరిస్తున్నారని ఆమె చెప్పినట్లుగాసమాచారం. వివిధ పార్టీలనేతలు ఈ విషయంపై తనకు కంప్లైంట్లు ఇచ్చారని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరి భేటీ చాలా తక్కువ సమయమే జరిగినప్పటికీ.. ఇవ్వాల్సిన సమాచారాన్ని ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు.. అధికార పార్టీ ఎమ్మెల్యేల్ని ఎర వేసినట్లుగా ఆరోపణలు వచ్చిన అంశం.. కేంద్రంలోని పెద్దలను ఇరకాటంలో పడేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవమరిస్తున్న తీరుపైనా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
అమిత్ షా - తమిళ సై మధ్య జరిగిన భేటీపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విలేకరులతో మాట్లాడుతూ.. తాను తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లుగా చెప్పారు. ఇదంతా సాధారణంగా జరిగే భేటీగా ఆమె అభివర్ణించటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.