త‌మిళ పోరు: ప‌ళ‌నికి సెగ పెడుతున్న బీజేపీతో జ‌ట్టు రీజ‌నేంటి?

Update: 2021-03-27 05:50 GMT
త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఒకే విడ‌త‌లో ఎన్నిక‌లు జ‌రిగే ఈ రాష్ట్రంలో తిరిగి అధికారం ద‌క్కించుకునేందుకు ప్ర‌స్తుత అధికార పార్టీ అన్నాడీఎంకే జోరుగా ప్ర‌య‌త్నిస్తోంది. వాస్త వానికి అమ్మ... జ‌య మ‌ర‌ణం త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌లు కావ‌డంతో ఈ సెంటిమెంటును వినియోగిం చైనా తాము ల‌బ్ధి పొందాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు అన్నాడీఎంకే కీల‌క ‌నాయ‌కులు. అయితే.. బీజేపీని ఒక‌నాడు వ్య‌తిరేకించిన ఈ పార్టీ.. ( ముఖ్యంగా జ‌య‌ల‌లిత ) ఇప్పుడు అదే పార్టీతో జ‌ట్టుక‌ట్టుకుని ముందుకు సాగు తుండ‌డాన్ని త‌మిళులు జీర్ణించుకోలేక పోతున్నారు.

దీనికి మ‌రో ప్ర‌ధాన కార‌ణం కూడా క‌నిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ క‌నుక త‌మిళ‌నాడులో నాలుగు నుంచి ఐదు స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కినా.. మున్ముందు బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఈ ప‌రిణామాన్ని త‌మిళులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎందుకంటే... త‌మిళ‌నాడు అంటేనే స్థానిక సంస్కృతికి, స్థానిక భాష‌కు, స్థానిక‌త‌కు పెట్టింది పేరు. అయితే.. బీజేపీ క‌నుక ఇక్క‌డ మొగ్గ తొడిగితే.. త‌మిళ స్థానిక‌త‌కు విఘాతం ఏర్ప‌డుతుంద‌నేది ఇక్క‌డివారి ఆవేద‌న. కేంద్రంలోని బీజేపీ పిలుపు ఇచ్చిన త్రిభాషా సూత్రానికి త‌మిళులు వ్య‌తిరేకం. అదేవిధంగా దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న `నీట్‌` ప‌రీక్ష‌కు ఇక్క‌డి వారు పూర్తిగా వ్య‌తిరేకం.

అలాంటి బీజేపీ.. క‌నుక ఇక్క‌డ బ‌ల‌పడితే.. హిందీని అమ‌లు చేయ‌డంతోపాటు.. జ‌ల్లిక‌ట్టు వంటి సంప్ర‌దాయ క్రీడ‌ల‌కు చెల్లుచెప్ప‌డం ఖాయ‌మ‌ని త‌మిళులు భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బీజేపీ హిందూ భాషా సూత్రానికి త‌మిళులు పూర్తిగా వ్య‌తిరేకులు. ఇంకా చెప్పాలంటే వీరికి ఆత్మాభిమానం ఎక్కువ‌. ఢిల్లీ పెత్త‌నం వీరు అస్స‌లు ఏ మాత్రం స‌హించ‌రు. ఈ నేప‌థ్యంలోనే బీజేపీకి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో సైతం ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో పోయి పోయి.. అమ్మ పార్టీ అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం.. 18 సీట్ల‌ను కేటాయించ‌డాన్ని త‌మిళ సంఘాలు, మేధావి వ‌ర్గాలు కూడా స‌హించ‌డం లేదు.

దీంతో బీజేపీపై ఉన్న కోపం కాస్తా... అన్నాడీఎంకే ప్ర‌స్తుత సార‌థి.. ప‌ళ‌ని స్వామిపై బాగానే ప‌డుతోంది. ఇక అన్నాడీఎంకేలో ప‌ళ‌నిస్వామి, ప‌న్నీరు సెల్వం వ‌ర్గాలు కూడా క‌త్తులు దూసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో వీళ్ల‌లో వీళ్లే అన్నాడీఎంకేను ఓడించేలా కూడా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీతో ఎవ‌రు పొత్తు పెట్టుకున్నావారికి ప్ర‌జ‌ల నుంచి ప‌రాభ‌వం త‌ప్ప‌దు.. అనే బోర్డులు వెలుస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ప‌రిణామాల‌ను ప‌ళ‌ని, ప‌న్నీర్ సెల్వంలు ఎలా ఎదుర్కొంటార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.
Tags:    

Similar News