సీఎం కుర్చీలో కూర్చోవాలనుకున్న చిన్నమ్మ కల ప్రస్తుతానికి వాయిదా పడినట్లే. అమ్మ మరణం తర్వాత సీఎం కుర్చీలోకూర్చునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపి.. పరిస్థితుల్ని తనకు అనుకూలంగా చేసుకున్న చిన్నమ్మకు.. కాలం కలిసి రావటం లేదు.అన్నాడీఎంకే పార్టీని.. నేతల్ని తన గ్రిప్ లోకి తెచ్చుకున్న చిన్నమ్మ.. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటం లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలతో మంగళవారం ఉదయం 8.40గంటలకు ఆమె ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం వాయిదా పడింది.
ఆదివారం నుంచి చోటు చేసుకున్న పరిణామాలకు అనుగుణంగా సోమవారం మరికొన్ని పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ.. నాటకీయ మలుపుల నేపథ్యంలో సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చిన్నమ్మ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఆదివారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా భేటీ అయి.. శశికళను అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీరు సెల్వం వ్యక్తిగత కారణాలతో తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి.. రాజీనామా లేఖను ఆమెకు అందజేశారు.
ఆ వెంటనే.. ఆ లేఖను తమిళనాడు గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావుకు అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఊటీలో ఉన్న ఆయన.. పన్నీరు సెల్వం రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో చిన్నమ్మను సీఎంగా చేసే అంశంపై స్పందించకుండా ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో చిన్నమ్మపై గతంలో నమోదైన ఆక్రమాస్తుల కేసులపై వారం వ్యవధిలో తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనికి తోడు.. ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు.. చిన్నమ్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకుండా అడ్డుకోవాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటీషన్ విచారణకు రానుంది.
ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో.. వారం వ్యవధిలో ఏం జరుగుతుందో చూసిన తర్వాతే.. సీఎంగా శశికళ నియమకంపై నిర్ణయం తీసుకోవాలన్న సూచన గవర్నర్ విద్యాసాగర్ రావుకు అందినట్లుగా తెలుస్తోంది. చిన్నమ్మను సీఎం పగ్గాలు అందించే విషయంలో వెయిట్ చేయాలన్న మాటను ఆటార్నీ జనరల్ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ పెద్దలు సైతం ఇదే అభిప్రాయాన్ని విద్యాసాగర్ రావుకు చెప్పటంతో ఆయన.. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిపోవటమే కాదు.. ఊటీలో ఉన్నకుటుంబ సభ్యుల్ని ముంబయికి తీసుకొచ్చేయాలంటూ అధికారులకు సూచించటం గమనార్హం.
మరోవైపు.. సోమవారం సాయంత్రం నుంచి మెరీనా బీచ్ సమీపంలోని మద్రాస్ యూనివర్సిటీలోని సెంటినరీ హాల్ లో శశికళ ప్రమాణస్వీకారోత్సవానికి చేస్తున్నఏర్పాట్లను రాత్రి నుంచి నిలిపివేశారు. పన్నీరు సెల్వం రాజీనామాను ఆమోదించిన విద్యాసాగర్ రావు.. శశికళను సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అంశంపై మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇలా.. ఒకదాని తర్వాత ఒకటిగా మారిన పరిణామాలు ఒకపక్క.. మరోపక్క శశికళను సీఎంగా బాధ్యతలు స్వీకరించే అంశంపై అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమ్మ ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ లో అయితే.. ఆమెను బహిరంగంగానే తప్పు పడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/