తమిళనాడు స్టూడెంట్లందరికీ సాఫ్టువేర్ శాలరీసే..

Update: 2016-04-18 08:53 GMT
వారంతా సాధారణ విద్యార్థులు. పాకెట్ మనీ కోసం అమ్మానాన్నలను రోజూ ఎంతో కొంత అడిగి తీసుకుంటారు. అలాంటి కుర్రాళ్లంతా ఇప్పుడు కరెన్సీ నోట్లతో కళకళలాడుతున్నారు. నచ్చిన బట్టలు - షూస్ కొనుక్కుంటున్నారు. కొందరైతే తాము ఎంతోకాలంగా కొనాలనుకుంటున్న స్మార్టుఫోన్లను సొంతం చేసుకుంటున్నారు. కాలేజీ కుర్రాళ్లకు ఇదంతా ఎలా సాధ్యమవుతుందనుకుంటున్నారా... అంతా ఎన్నికల మహిమ. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని అక్కడి స్టూడెంట్లంతా రోజుకు 1200 మినిమమ్ సంపాదిస్తున్నారు.  కరెక్టుగా ఎన్నికల వేళ కాలేజీలకు - స్కూళ్లకు సెలవులు రావడంతో వారికి బాగా కలిసొచ్చింది.  ఎన్నికల వేడి ఊపందుకోవడంతో పార్టీల ర్యాలీల్లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు.

ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న తమిళనాడులో, ఒక్కో పార్టీ ర్యాలీ నిర్వహిస్తే, అందుకోసం కనీసం 20 వేల మందిని నేతలు సమీకరించాల్సి వుంటుంది. ఇక ర్యాలీలో పాల్గొనే విద్యార్థులకు డిమాండ్ పెరిగిపోయింది. ఒక రోజు తమ వెంట ఉండి ర్యాలీ - సభలకు హాజరై జేజేలు కొట్టిన వారికి పార్టీలు రూ. 1200 వరకూ ఇస్తుండటంతో, విద్యార్థులు తమ జేబులు నింపుకొంటున్నారు.  కాస్త తెలివైన కుర్రాళ్లు పార్టీలకు మస్కా కొట్టి ఒకే రోజు రెండు మూడు ర్యాలీల్లోనూ పాల్గొంటున్నారు. కాగా ఎన్నికల ఖర్చులు ఈసీకి దొరక్కుండా ఉండేందుకు ఈ ర్యాలీల జనసమీకరణ బాధ్యతను ఈవెంట్ మేనేజర్లకు అప్పగిస్తున్నారు. ఇక వారు వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి విద్యార్థులను సంప్రదించి, వారిని ర్యాలీలకు పంపుతున్నారు. ర్యాలీల్లో పాల్గొనే సాధారణ పురుషులలకు 600... ఆడవాళ్లకు 800 ఇస్తున్న పార్టీలు.. విద్యార్థులకు మాత్రం 1200 ఇస్తున్నాయట. మొత్తానికి ఈ ఎన్నికలు తమిళ స్టూడెంట్లకు పండగ తెచ్చినట్లే. సాఫ్టువేర్ ఉద్యోగుల మాదిరిగా నెలకు 50 వేలు సింపుల్ గా సంపాదించేస్తున్నారు.
Tags:    

Similar News