పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ అలీని మంచి స్నేహితుడని భావించాను, నేను అలీకి చాలా సాయం చేశాను, అలీ ఇప్పుడు ఇలా చేస్తాడని తాను ఊహించలేదు అంటూ విమర్శలు చేసిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ తనపై చేసిన విమర్శలకు అంతే ఘాటుగా అలీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. పవన్ ఇండస్ట్రీకి రాకముందే నేను సినిమా పరిశ్రమలోకి వచ్చాను. ఆయన నాకు చేసిన సాయం ఏంటో చెప్పాలి అంటూ సవాల్ విసిరాడు. వీరిద్దరి మద్య జరిగిన ఈ వాగ్వివాదం సినీ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశం అయ్యింది.
జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ - ఇటీవలే వైకాపాలో జాయిన్ అయిన అలీల మద్య ఇలాంటి వాదనలు రావడం ఏమాత్రం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అలీని వ్యక్తిగతంగా నేను నీకు సాయం చేశాను అంటూ టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ కు పద్దతి కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయమై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ వీరిద్దరి వివాదం వల్ల తనకు బాధేసిందని అన్నాడు.
తమ్మారెడ్డి మాట్లాడుతూ... ఇద్దరితో నాకు మంచి పరిచయం ఉంది. అయితే వారిద్దరి అనుబంధం ఇంకా ఎక్కువ. అలాంటి వారిద్దరు ఇలా రోడ్డు మీద పబ్లిక్ గా విమర్శించుకోవడం బాధేసింది. ఒక వ్యక్తి గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా నెగటివ్ గా మాట్లాడడు. అలాంటిది అలీ గురించి ఎందుకు ఇలా మాట్లాడాడో. కాస్త ఓపికతో అలీ విషయమై స్పందించి ఉంటే బాగుండేది. నేను సాయం చేశాను అనే పదం రావడంతో అలీ ఈగో హర్ట్ అయ్యి ఉంటుందని అభిప్రాయ పడ్డాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకరితో ఒకరు ఫోన్ లో మాట్లాడుకుని ఉంటే బాగుండేది. మంచి స్నేహితులను రాజకీయాలు శత్రువులను చేస్తుందని చెప్పడానికి ఇది నిదర్శణం. రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు వెళ్లాను అంటూ చెబుతున్న పవన్ కళ్యాణ్ కాస్త ఓపికతో ప్రయత్నించాలి. అంతే తప్ప ఇలా ఓపిక లేకుండా మాట్లాడితే ఇతర రాజకీయ నాయకులతో పవన్ కు తేడా లేకుండా పోతుందనే అభిప్రాయంను తమ్మారెడ్డి భరద్వాజా అన్నారు.