ఆంధ్ర ప్రదేశ్ సినిమా టిక్కెట్ ల ధరలని తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాలకు ఏపీ ప్రభుత్వానికి మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో కొవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. సదరు వ్యాఖ్యలపై నిర్మాతల మండలి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ బహిరంగంగా ఓ లేఖని విడుదల చేసిన విషయం తెలిసిందే.
`సినిమా వాళ్లకు బలిసింది` అంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తాజాగా సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. బుధవారం ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి బలిసిందో తెలియాలంటే వైసీపీ ఎమ్మెల్యేలు దమ్ముంటే ఓపెన్ డిబేట్ కు రావాలని సవాల్ చేశారు. సినిమావాళ్లంటే చీప్ గా దొరికారని బలిశారు అని మాట్లాడుతున్నారు. ఎవరు బలిశారు సర్? .. మీ ఎమ్మెల్యేలు ఎంతెంత తింటున్నారు? మీ చరిత్రలేంటీ? వాటి గురించి మాట్లాడుకుంటదామా? .. ఓపెన్ డిబేట్ కు వస్తారా ఎవరైనా? దమ్ముందా? ఎవరిని మెప్పించడానికి మీరు బలుపులు, కులాల గురించి మాట్లాడుతున్నారు? అంటూ ఫైర్ అయ్యారు.
మీరంతా రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులు ఎంత.. వచ్చాక ఎంత? .. మీ పార్టీలోని చోటా మోటా నాయకుల ఆస్తులు తీయండి.. మా సినిమా వాళ్ల ఆస్తులు తీద్దాం రండి. ఎవరి ఆస్తి ఎంతుందో లెక్క తీద్దామా? .. దమ్ముంటే రండి.. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అని మండి పడ్డారు. మేము కష్టపడి సంపాదిస్తున్నామని, సినిమాను తయారు చేస్తున్నాం. మా కళలను అమ్ముతున్నాం అన్నారు.
ఒక సినిమాకు 200 మంది పైనే కష్టపడి పని చేస్తున్నారని, మేము కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నాం అన్నారు. అంతే కానీ మీలా ఒక రూపాయి పెట్టి మొత్తం అంతా దోచుకుతినట్లేదన్నారు.మాకు బలుపు అనడానికి మీరెవరు అసలు? ..ముందు మీ బలుపు సంగతి మీరుచూసుకోండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా వుండదని సవినయంగా మనవి చేస్తున్నా అని తమ్మారెడ్డి భరద్వాజ ఏపీ వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది. మరి తమ్మారెడ్డి కౌంటర్ పై సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి, ఏపీ నేతలు ఏమంటారో చూడాలి.