భారత ప్రధాన న్యాయమూర్తి శరత్ అరవింద్ బాబ్డే తల్లినే నమ్మించి మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాబ్డే తల్లి ముక్తా అరవింద్ బోబ్డే అస్తుల కేర్ టేకర్ గా ఉంటున్న వ్యక్తి ఏకంగా 2.5 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు తపస్ ఘోష్ ను అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ... మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లోని ఆకాశవాణి కేంద్రం సమీపంలో బోబ్డే కుటుంబానికి ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాలు జస్టిస్ ఎస్ ఏ బోబ్డే తల్లి అయిన ముక్తా బోబ్డే పేరు మీద ఉంది. దానికి 10ఏళ్లుగా తపస్ ఘోష్ అనే 47ఏళ్ల అనే వ్యక్తి కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైపోయిన ముక్తాకు తప్పుడు లెక్కలు చెబుతూ ఏళ్ల తరబడి గోల్‌మాల్ వ్యవహారాలు చేశాడు తపస్.
అయితే లెక్కల్లో తేడాలొచ్చాయని గుర్తించిన ముక్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఘోష్ ను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం ఈ నెల 16 వరకు రిమాండ్‌కు తరలించారు. సీజేఐ జస్టిస్ బోబ్డే తల్లిని ఫ్యామిలీ కేర్ టేకర్ మోసం చేశాడన్న కేసు విచారణకు డీసీపీ వినితా సాహు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. దర్యాప్తులో కేసు లోతుపాతుల్ని పరిశీలించారు. ఈ మేరకు గడిచిన కొన్నేళ్లుగా తపస్ ఘోష్ రూ.2.5కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.