పరువు కోసం కోర్టు కు టీడీపీ, వైసీపీ నేతలు

Update: 2020-01-04 10:45 GMT
ఏపీ రాజధాని లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పంచాయితీ కొత్త మలుపు తిరుగుతోంది. అమరావతి ప్రకటనకు ముందే టీడీపీ నేతలు అక్కడి భూములు కొన్నారని వైసీపీ నేతలు వీడియో ప్రదర్శించి మరీ గురువారం ఎండగట్టిన సంగతి తెలిసిందే.. రాజధాని పేరుతో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతలు కంభంపాటి, పరిటాల శ్రీరాం, నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారికి రాజధానిలో భూములున్నాయని పేర్కొన్నారు.

దీని పై సదురు టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఆ ఆరోపణలను ఖండించారు. కంభంపాటి రామ్మోహన్ రావు అయితే తనపై ఆరోపణలు చేసిన వారిపై కోర్టు కు వెళ్లి పరువు నష్టం దావా వేయడానికి రెడీ అయ్యారు.2006 లో తాను భూములు కొంటే 2014 తర్వాత కొన్నట్లు గా వైసీపీ నేతలు చూపించారని.. తన పరువుకు నష్టం కలిగించారంటూ ఆయన కోర్టు కు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇక పరిటాల శ్రీరామ, ధూళిపాళ్ళ నరేంద్ర కూడా వైసీపీ నేతల పై పరువు నష్టానికి రెడీ అయ్యారు.

ఇక విశాఖను పరిపాలన రాజధానిగా చేశాక అక్కడ వైసీపీ నేతలు భూములు కొన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు పలువురు వైసీపీ నేతలు విశాఖ లో భూములు కొన్నారని ఆరోపిస్తున్నారు. దీంతో సదురు వైసీపీ నేతలు కూడా ఆరోపించిన వారిపై పరువు నష్టం వేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరిట ఆరోపణలు అంతిమంగా పరువు నష్టానికి దారితీస్తున్నాయి. వాళ్లంతా కోర్టుకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ ఆరోపణలు కోర్టు లో నెగ్గుతాయో లేదో చూడాలి మరీ
Tags:    

Similar News