ఉత్తరాంధ్ర సీనియర్ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చిక్కుల్లో పడ్డాడు. మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మరిడిమాంబ ఉత్సవాల సందర్భంగా పోలీసులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఆయనపై కేసు నమోదు చేశారు. 353తోపాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు పెట్టారు.
నర్సీపట్నం గ్రామ దేవత మరిడిమాంబ పండుగను నిర్వహించడానికి ఏఎస్పీ అనమతులు ఇవ్వట్లేదని అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు చేశారు.రికార్డింగ్ డ్యాన్సులు, వాహనాల రాకపోకలకు ఆటంకాన్ని కలిగించినా చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. వివిధ కారణాలతో అనుమతులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు.ఉత్సవాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్పందించలేదని విమర్శించారు.
ఇక ఇదివరకూ నర్సీపట్నం చుట్టుపక్కల నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారనే సమాచారం తన వద్ద ఉందని.. వారికి ఎందుకు అనుమతులు ఇచ్చారని అయ్యన్న నిలదీశారు. అధికార పార్టీ నాయకులకు మాత్రమే పండుగ చేసుకునే అవకాశాన్ని పోలీసులు ఇచ్చారని మండిపడ్డారు.
కరోనా వల్ల కిందటి ఏడాది పండుగను జరుపుకోలేదని.. ఈసారి తాను స్వయంగా ఏఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చినప్పటికీ స్పందించలేదన్నారు. పైగా నిర్వహిస్తే అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ హెచ్చరించినట్లు ఏఏస్పీ తెలిపారు.
దీనిపై అయ్యన్న నిప్పులు చెరిగారు. తాము మాజీ మంత్రి కొడాలి నానిలాగా పేకాట క్లబ్లులను నిర్వహించట్లేదని అయ్యన్న ధ్వజమెత్తారు. ఆడవాళ్లతో అశ్లీల డ్యాన్సులు తాను ప్రోత్సహించట్లేదని స్పష్టం చేశారు. నర్సీపట్నంలో రికార్డింగ్ డ్యాన్సులు జరిగాయని.. పోలీసులు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
మొత్తంగా సీనియర్ నేత పండుగ కోసం ఏకంగా పోలీసులనే తిట్టి కేసుల పాలయ్యారు. పోలీసులు పండుగకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై ఆయన పోరుబాట పట్టారు.