ఏమిటీ దండకాలు. ఏమిటీ పూనకాలు అని అనిపిస్తుంది కదూ చదువుతూంటే. కానీ ఇవి ఒక మాజీ మంత్రి గారి ఫైర్ బ్రాండిజం అంటే సబబుగా ఉంటుంది. ఆయన పాతతరానికి చెందిన నాయకుడు అయినా అప్ టూ డేట్ గా సోషల్ మీడియాకు యమ స్పీడ్ గా కనెక్ట్ అయి అధికార వైసీపీని చెడుగుడు ఆడించేస్తున్నాడు. ఆయనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.
ఇంతకీ ఆయన ఈ స్తోత్రపాఠాలు ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలుసా. బూతుల మంత్రిగా గత మంత్రివర్గంలో పేరొంది ప్రస్తుతం మాజీగా మారిన కొడాలి నాని గురించే. కొడాలి నాని ఈ రోజు టీడీపీ యువ కిశోరం లోకేష్ టెన్త్ పోయిన విద్యార్ధులతో జూం మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారు. నాని తన మేనల్లుడి ఐడీ నుంచి లాగిన్ అయి లోకేష్ జూం లోకి దూసుకుని వచ్చేశారు. అలాగే మరో ఎమ్మెల్యే వల్లభనేని కూడా సడెన్ ఎంట్రీ ఇచ్చారు.
ఆ తరువాత వారు లోకేష్ ని ప్రశ్నించబోవడం, ఆయన ఇపుడు కాదు డైరెక్ట్ గానే మాట్లాడుతానని సవాల్ చేయడం అదొక రాజకీయ రచ్చకు తెర తీసిన సందర్భం. ఆ తరువాత కొడాలి ప్రెస్ మీట్ పెట్టి మరీ లోకేష్ మీద విరుచుకుపడ్డారు. తాము జూం లోకి వస్తే లోకేష్ పారిపోయారని విమర్శించారు. పదవతరగతి పోయిన విద్యార్ధులకు ధైర్యం కల్పించాల్సింది పోయి రాజకీయం చేయడం తగునా అని ఆయన తనదైన శైలిలో గుడ్లు ఉరిమారు.
ఇక అంతే కొడాలి మీద టీడీపీ మాజీ మంత్రులు అంతా దండయాత్ర చేశారు. అయితే పంచులకే పెద్దన్నగా పేరు గడించిన అయ్యన్న రంగంలోకి దిగి కొడాలిని ఒక్క లెక్కన ఆడుకున్నారు. సన్నబియ్యం ఇస్తానని చెప్పి తన మంత్రి పదవిలో ఇవ్వలేకపోయిన సన్నాసి కొడాలి నాని అంటూ దుయ్యబెట్టారు. ఎనిమిదవ తరగతి ఫెయిల్ అయిన నానికి టెన్త్ ఫెయిల్ అయిన జూం మీటింగ్ తో సంబంధం ఏంటి అని కూడా అయ్యన్న ప్రశ్నించారు.
గడప గడపకీ వెళ్తూంటే జనాలు చెప్పుతో కొడుతున్నారనే జూం మీటింగుకు వచ్చారని కొడాలి నాని మీద ఘాటు విమర్శలు చేశారు. జగన్ రెడ్డి జనాలలోకి వస్తే జనం పరిగెత్తించి కొడతారు అని కూడా అయ్యన్న అన్నారు. మొత్తానికి లోకేష్ జూం లోకి ఎంట్రీ ఇవ్వడం కాదు కానీ అయ్యన్న స్తోత్ర పురాణానికి కొడాలి నాని టార్గెట్ కావడమే విచిత్ర రాజకీయం.