వైసీపీకి నిద్ర పట్టదట‌ : అయ్యన్న అరెస్ట్ కావాల్సిందే... ?

Update: 2022-06-19 04:22 GMT
వైసీపీ మూడేళ్ళ ఏలుబడిలో మహామహులు అనుకున్న వారిని అందరికీ చాలా ఈజీగా  అరెస్ట్ చేసి పారేశారు. చాలా మంది నేతలకు జైలు దారిని కూడా చూపించారు. ఒక విధంగా టీడీపీ ఈసారి ప్రతిపక్షంలోకి వచ్చాక పడరాని పాట్లు పడింది అనే చెప్పాలి. అలాంటి వైసీపీ దూకుడులో కూడా చిక్కకుండా సేఫ్ జోన్ లో ఉన్న ఒకే ఒక్కడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆయన తెల్లారి లేస్తే వైసీపీ సర్కార్ మీద జగన్ మీద మంత్రుల మీద అనుచితమైన వ్యాఖ్యలే చేస్తూంటారు.

దాంతో వైసీపీ నేతలు కలత చెందినా ఏమీ చేయలేని పరిస్థితి. చెత్తనా కొడుకు అంటూ ఆయన పద ప్రయోగం చేసినా మంత్రి రోజా మీద మగతనం  పేరిట కామెంట్స్ చేసి సవాళ్ళు చేసినా ఘనత వహించిన ఆంధ్రా యూనివర్శిటీని  కించపరచినా అయ్యన్నకే చెల్లు. ఆయనకు అంబటి రాంబాబు అయినా జగన్ అయినా ఎవరైనా ఒక్కటే.

ఆయన నేను ఇలాగే అంటాను ఇలాగే తిడతాను ఏమి పీక్కుంటారో పీక్కోండి అంటారు. తుగ్లక్ రెడ్డి అని దుర్మార్గుడు అని శాడిస్ట్ అని  జగన్ మీద దారుణమైన కామెంట్స్ చేస్తారు. ఇదిలా ఉండగా చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా టూర్ లో అయ్యన్న రెచ్చిపోయి మాట్లాడారు. ఒక దశలో బాబు సైతం ఆయన స్పీచ్ ని అలా వింటూ చూస్తూండిపోయారు.

ఎందుకంటే అయ్యన్న ఎక్కడా ఆగరు. ఆయన మాటల  ప్రవాహం అలాంటిది. ఒక వైపు టీడీపీ దూకుడు మరో వైపు అయ్యన్న ప్రసంగాలు ఇపుడు వైసీపీకి నిద్రపట్టనీయకుండా చేస్తున్నాయి. అనాల్సినవి అన్నీ అనేసి ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఫినిషింగ్ టచ్ ఇస్తున్న అయ్యన్న ఒక విధంగా వైసీపీ పాలకుల ఇగోను హర్ట్ చేస్తున్నారు. ఇప్పటికి పలు మార్లు  అయ్యన్నను అరెస్ట్ చేయాలని చూసినా ఆయన ఎక్కడా చిక్కలేదు.

తాజాగా ఆయన హాట్ హాట్ కామెంట్స్ తరువాత  అయ్యన్నపాత్రుడుకు 41సీఆర్పీసీ నోటీసు ఇచ్చేందుకు శనివారం నర్సీపట్నం విచ్చేసిన  గుంటూరు జిల్లా నకిరేకల్ పోలీసులు  అయ్యన్నఇంట్లో  లేకపోవడంతో చాలాసేపు అక్కడే వేచి చూసు వెనక్కి తిరిగి ప్రయాణం అయ్యారు. ఇక విషయానికి వస్తే 2021 సంవత్సరంలో గుంటూరు జిల్లా నకిరేకల్ లో అక్కడ స్థానికులు ఫిర్యాదు మేరకు  మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పై  కేసు నమోదు చేసిన పోలీసులు దాని మీద ఆయన్ని అరెస్ట్ చేయాలని యత్నించారు.

అయితే అప్పుడు మాజీ మంత్రి కు హైకోర్టు ముందస్తు బెయిల్  మంజూరు చేయడం తో పోలిసులు అరెస్టు నిలిపి వేశారు. మళ్లీ ఇన్నాళ్ళ తరువాత ఆ కేసు మీద వచ్చారా లేక లేటెస్ట్ గా ఎవరైనా ఫిర్యాదు చేశారని వచ్చారా అన్నది తెలియదు కానీ  గుంటూరు పొలిసులు మాజీ మంత్రి నివాసానికి  చేసుకొని నోటీస్ గురించి చెప్పడంతో నర్శీపట్నంలో వాతావరణం వేడెక్కింది. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుతిరిగి నర్సీపట్నం పోలీస్ స్టేషన్ కు చేసుకున్నారు. అయ్యన్న లేని సంగతిని పోలీసు ఉన్నతాధికారులు సమాచారం చేరవేసామని  గుంటూరు తిరిగి వెల్లిపోతున్నట్లు  మీడియాకు పోలీసులు తెలిపారు.

మొత్తానికి పరిస్థితి చూస్తూంటే అయ్యన్నను అరెస్ట్ చేయడానికి మరోమారు ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. టీడీపీ నేతలు ఎందరు అరెస్ట్ అయినా రాని కిక్కు ఒక్క అయ్యన్న అరెస్ట్ తో వస్తుంది అని వైసీపీ నేతలు  అంటున్నారు. ఆయన అంతలా వైసీపీ పెద్దల మైండ్ ని ఖరాబు చేస్తున్నారని కూడా వాపోతున్నారు. అయితే అయ్యన్న మాత్రం అసలు దొరకడంలేదు. మరి ఈసారి గట్టిగానే పట్టుపడతామని వైసీపీ నేతలు అంటున్నారు. చూడాలి మరి అయ్యన్న అరెస్ట్ అవుతారా లేదా అన్నది.
Tags:    

Similar News