ఏపీలో కొత్తగా విపక్ష హోదాలో కూర్చున్న తెలుగుదేశం పార్టీకి గతంలో ఎన్నడూ లేనంత మేర ఇబ్బంది వచ్చి పడింది. ఓటమి బాధ నుంచి ఆ పార్టీ తేరుకోకముందే... పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు మూకుమ్మడిగా హ్యాండిచ్చేసి బీజేపీ గూటికి చేరిపోయారు. ఇక రాజ్యసభలో టీడీపీకి మిగిలింది ఇద్దరు మాత్రమే. ఇక లోక్ సభలోనూ ఆ పార్టీ బలం ఏకంగా మూడుకు దిగజారింది. వెరసి మొత్తం పార్లమెంటులో టీడీపీ బలం ఐదుకు దిగజారిపోయింది. నిన్న నలుగురు ఎంపీలు షాకిస్తే... వారికి షాకిచ్చేందుకు ప్రస్తుతం పార్లమెంటులో టీడీపీ సభ్యులుగా ఉన్న ఐదుగురు రంగంలోకి దిగారు. అయితే జంపింగ్ లపై చర్యలు ఎలాగూ తీసుకోరని తెలిసి కూడా వారు రంగంలోకి దిగడం నిజంగానే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
నిన్న తాము బీజేపీలో చేరుతున్నామని - తమను బీజేపీ ఎంపీలు గానే గుర్తించాలని రాజ్యసభ సభ్యులు వై.సుజనా చౌదరి - సీఎం రమేశ్ - గరికపాటి మోహన్ రావు - టీజీ వెంకటేశ్ లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ ఇవ్వడం - నేటి ఉదయానికంతా వారిని బీజేపీ సభ్యులుగా వెంకయ్య గుర్తించడం జరిగిపోయింది. రాజ్యసభ వెబ్ సైట్ లోనూ ఈ మేరకు మార్పులు జరిగిపోయాయి. పార్టీ మారిన నలుగురు బీజేపీ సభ్యులుగా మారిపోతే... టీడీపీ ఖాతాలో ఇద్దరు ఎంపీలనే వెబ్ సైట్ చూపిస్తోంది. అంటే.. మొత్తంగా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇప్పుడు అధికారికంగానే బీజేపీ సభ్యులుగా మారిపోయారు. ఇవేవీ పట్టని టీడీపీ వారిపై ఫిర్యాదు చేసేందుకు నేటి సాయంత్రం వెంకయ్యను ఆశ్రయించింది.
రాజ్యసభలో టీడీపీ సభ్యులుగా మిగిలిపోయిన తోట సీతారామలక్ష్మీ - కనకమేడల రవీంద్ర కుమార్ లతో పాటు ఆ పార్టీ లోక్ సభ సభ్యులు కేశినేని నాని - గల్లా జయదేవ్ - కింజరాపు రామ్మోహన్ నాయుడులు కాసేపటి క్రితం వెంకయ్యనాయుడిని కలిశారు. తమ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వాలను దక్కించుకుని ఇప్పుడు బీజేపీ లో చేరిపోయిన నలుగురు ఎంపీల అభ్యర్థిత్వాలను రద్దు చేయాలని వారు వెంకయ్యకు వినతి పత్రం అందజేశారు. అయితే పార్టీ మారిన నలుగురు ఎంపీలను ఇప్పటికే బీజేపీ సభ్యులుగా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న వెంకయ్యనాయుడు... ఇప్పుడు టీడీపీ తరఫున తనకు అందిన వినతిపత్రాన్ని బుట్ట దాఖలు చేయడం మినహా చేసేదేమీ లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా పార్టీ మారిన నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని టీడీపీలో మిగిలిపోయిన ఐదుగురు ఎంపీల ఇచ్చిన వినతిని వెంకయ్య నాయుడు పట్టించుకునే అవకాశమే లేదన్న మాట.