కాలం కలిసిరాకపోతే అన్ని మూసుకొని ఉండడమే ఉత్తమం. ఈ కరోనా టైంలో అందరూ చేస్తున్నది అదే. రాజకీయ ప్రత్యర్థులు చెలరేగిపోతుంటే కూడా బాధిత రాజకీయ నాయకులు అదే చేస్తుంటారు. ఎన్నికలు రాగానే యాక్టివ్ అయ్యి వారిని ఓడిస్తారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కూడా మౌనం దాల్చడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేసింది
టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ మధ్య టీడీపీ మాజీ మంత్రులకు బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ల ఇంటికి వెళ్తూ పరామర్శలు చేస్తున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా కలవడానికి ఆయన అన్న, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఫోన్ చేశాడట.. తాను వస్తానని అంటే.. ‘అయ్యా చంద్రబాబు నీకు వంద దండాలు.. మా ఇంటికి రావద్దు’ అని అన్నాడని తాడిపత్రిలో హాట్ టాపిక్ నడుస్తోంది.ఇది ఆ నోటా ఈ నోటా విని పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోందట..
జగన్ సర్కార్ ప్రతీకారం మొదలుపెట్టినప్పటి నుంచి అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రెండు నెలల నుంచి సైలెంట్ అయ్యి కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయాడు. జగన్ సర్కార్ పై ఒక్క విమర్శ చేయడం లేదు. ఇంట్లోనే కాలం గడుపుతున్నాడు. మీడియాతో మాట్లాడవద్దని.. 2-3 ఏళ్లు కేవలం కార్యకర్తలతోనే మాట్లాడుదాం అని.. బయటకి ఎవరితో ఏమీ మాట్లాడవద్దు అని జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులందరికీ హెచ్చరికలు జారీ చేశారట..
ఎందుకంటే ఈ ప్రభుత్వం మనల్ని తొక్కేసే ప్లాన్ లో ఉందని.. కాబట్టి 2-3 ఏళ్లు చాలా ఇంపార్టెంట్ అని.. చంద్రబాబుతో కూడా అంటీ ముట్టనట్టు ఉందాం అని.. ఇప్పుడు పాత రాజకీయం మాదిరి లేదు కాబట్టి కొంచెం సంయమనంతో సైలెంట్ గా ఉందామని జేసీ దివాకర్ రెడ్డి సన్నిహితులతో చెప్పాడట.. కార్యకర్తలతోనే సంబంధాలు పెట్టుకొని సైలెంట్గా ఉందని అనుకుంటున్నారట..
అందుకే చంద్రబాబుకు సైతం వచ్చి రాజకీయాన్ని మళ్లీ సెగలు రేపద్దు అని జేసీ దివాకర్ రెడ్డి చెప్పాడట.. మరి చంద్రబాబు వెళ్తాడా? వెళ్లడా అనేది చూడాలి.