టీడీపీ మాజీ ఎమ్మెల్సీ వర్సెస్‌ పోలీసు అధికారుల సంఘం!

Update: 2022-11-22 07:59 GMT
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడిపై ఏపీ పోలీసు అధికారుల సంఘం మండిపడింది. పోలీసులను ఉద్దేశించి చెంగల్రాయుడు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకోసారి తమను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది.

చెంగల్రాయుడిని చట్టసభలకు పంపిన మాజీ సీఎం చంద్రబాబు సిగ్గుపడాలి అంటూ పోలీసుల అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. చెంగల్రాయుడు పోలీస్‌ శాఖపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నిప్పులు చెరిగారు. ఆయన వ్యాఖ్యలను ఖండించని చంద్రబాబు క్షమాపణ చెప్పాలని జనకుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఊడిపోవడానికి తమ యూనిఫామ్స్‌ ఏమీ ఖద్దరు దుస్తులు కావన్నారు. ఇంకోసారి తమను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.  

కాగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు పోలీసులను దుర్భాషలాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. స్వయంగా చంద్రబాబు, ఇతర ముఖ్య నేతల సమక్షంలోనే పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పోలీసు నా కొడుకులు ఫోన్‌చేస్తే రికార్డు చేయాలని కార్యకర్తలకు చెంగల్రాయుడు సూచించారు. కార్యకర్తలు పోలీసుల వాయిస్‌ రికార్డు చేయాలని, పోలీసులను భయపెట్టేలా మాట్లాడాలని, వారిని బెదిరించాలని సూచించారు.

అంతేకాకుండా పోలీసులు కోర్టుకు తీసుకెళ్లతాక... 'మేజిస్ట్రేట్‌ చెప్పుకునేది ఏమైనా ఉందా' అని అడుగుతారని.. అప్పుడు అబద్ధాలు చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. పోలీసులు తమను ఎగిరెగిరి తన్నారని చెప్పాలన్నారు. చెప్పరాని చోట పోలీసులు ముగ్గురు ఎగిరి తన్నారని.. చాలా నొప్పిగా ఉందని నటించాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు.

అప్పుడు నా కొడుకులకు ఖాకీ గుడ్డలు ఊడిపోతాయి అంటూ కార్యకర్తలకు బత్యాల చెంగల్రాయుడు సూచించారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా ఏపీ పోలీసు అధికారుల సంఘం మండిపడింది. బత్యాల తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. చంద్రబాబు సైతం క్షమాపణలు చెప్పాలని కోరింది.

మరోవైపు పోలీసు అధికారుల సంఘంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఒక సీఐ చొక్కా పట్టుకుని.. 'లంజాకొడకా చొక్కా ఊడదీసి కొడతా' అని అన్నప్పుడు పోలీసు అధికారుల సంఘం ఎందుకు స్పందించలేదని నిలదీస్తోంది. పోలీసు అధికారుల సంఘం కూడా జగన్‌కు ఊడిగం చేస్తోందని టీడీపీ నేతలు సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News