'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా..' ఎపిసోడ్లకు ఎపిసోడ్లు కొనసాగుతూ ఉన్నట్టుంది. తెలుగుదేశం పార్టీ ఓటమి విషయంలో ఆ పార్టీ వీరాభిమానులు ఇలానే రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ఫలితాలు వచ్చి నెలన్నర కావొస్తున్నా తెలుగుదేశం వీరాభిమానులు మాత్రం చంద్రబాబు విషయంలో ఆశ్చర్యాన్ని ఏ మాత్రం తగ్గించుకోవడం లేదట. చంద్రబాబును కలిసి ‘మీరు ఓడిపోవడం ఏమిటయ్యా..’ అంటూ వారు వాపోతూనే ఉన్నారట.
ఆ సీరియల్ కు సంబంధించిన ఎపిసోడ్లు కొనసాగుతూ ఉన్నాయని టీడీపీ అనుకూల మీడియా చెబుతూ ఉంది. చంద్రబాబు ఇంటి వద్ద సాగే ఆ సీన్లను టీడీపీ అనుకూల మీడియా వర్ణించి చెబుతూ ఉంది. చంద్రబాబును కలిసిన అభిమానులు ‘మీరు ఓడిపోవడం ఏమిటయ్యా..’ అంటూ బాధపడుతూ ఉన్నారని ఆ మీడియా వార్తలు వర్ణిస్తున్నాయి.
ఎన్నికల్లో టీడీపీని ఏపీ ప్రజలు ఓడించినా తమకు నాయకుడు మాత్రం చంద్రబాబు నాయుడే అని అక్కడకు వచ్చిన వారు చెబుతూ ఉన్నారట. ఇలా అనుకుంటే ఇబ్బందే లేదు. ఓడిపోయినందుకు బాధపడాల్సిన అవసరమే లేదేమో!
తామంతా ఓటేసినా చంద్రబాబు నాయుడు ఓడిపోయారని - ఈవీఎంలలో ఏదో మోసం జరిగిందని అక్కడకు వచ్చిన వాళ్లు చెబుతూ ఉన్నారట. ఏదో ఒక రోజు రెండ్రోజులు ఇలాంటి డ్రామాలు రక్తి కట్టిస్తే ఒక ఎత్తు. అయితే ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్లు 'నమ్మలేకపోవడం..' అనే ఫీలింగ్ నుంచి బయటకు రాకపోతే ఆ పార్టీకే కష్టమేమో!