ఏమైనా బాబు బాబే. బాబు తర్వాతే ఎవరైనా. అదిరిపోయే ప్లానింగ్ చేయటం ఆయన తర్వాతే. బాబును నెత్తిని పెట్టుకొని చూసుకునే అనుకూల మీడియా ఒకటి షాకింగ్ సర్వే అంటూ అచ్చేసిన ఒక కథనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అది కూడా.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే ఫలితాలు అంటూ ప్రముఖ మీడియాలో పబ్లిష్ చేసిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇదంతా ఎవరి కోసం.. ఎందుకోసం జరుగుతోంది? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో బాబు భేటీ అవుతున్న వేళలో.. ఈ తరహా కథనం ఒకటి బయటకు రావటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. బాబును నెత్తిని పెట్టుకొని చూస్తుందన్న మీడియా సంస్థలో వచ్చిన కథనంలో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఇంతకీ.. సదరు కథనంలో ఉన్న ప్రధాన అంశం ఏమంటే.. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఒక సర్వేను చేసిందని.. . ఆ సర్వేలో కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయన్నది వార్త సారాంశం. ఊహించని రీతిలో కాంగ్రెస్ కంటే టీడీపీకే తెలంగాణలో ఎ్కువ బలం ఉందన్నట్లుగా ఫలితాలు వచ్చాయని సదరు కథనం పేర్కొంది.
కాంగ్రెస్ తో పాటు టీడీపీ బలంగా ఉన్నట్లుగా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ఇదంతా కాంగ్రెస్ చేస్తున్నట్లుగా పేర్కొనటం కొసమెరుపు. అయితే.. ఈ సర్వే ఫలితం మొత్తం కట్టుకథగా అభివర్ణిస్తున్న వారు లేకపోలేదు. ఎందుకంటే.. బాబు పార్టీ బలంగా ఉందన్నది ఉత్త భ్రమ. ఆ విషయం బాబుకు కూడా తెలుసు. నిజంగా తమకు అంత బలం ఉందని తెలిస్తే.. 15 సీట్లకే పరిమితం కావాల్సిన అవసరం లేదు. మరిన్ని సీట్లు కావాలంటూ మిత్రపక్షంగా ఇప్పటికే రచ్చ రచ్చ చేసేది.
ఇందుకు భిన్నంగా పరిస్థితి ఉందంటే.. కచ్ఛితంగా ఇది బాబు మార్క్ ప్లాంటెడ్ స్టోరీ అని.. కానీ దానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్వే అంటూ కలర్ ఇవ్వటం చూస్తే.. తమకు భారీగా బలం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగాలన్నట్లుగా చెప్పేందుకే తాజా సర్వే తనకు అనుకూల మీడియాలో పబ్లిష్ చేసినట్లుగా చెబుతున్నారు.
సదరు సర్వే ప్రకారం చూస్తే.. 35 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు పక్కా అని డిసైడ్ చేసిందట. అంతేనా.. సదరు 35 స్థానాల్లో టీడీపీ.. కాంగ్రెస్ ఎవరు పోటీ చేసిన గెలుపు ఖాయమని తేల్చారు.
టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల జాబితాను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేతికి ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
అదే రీతిలో అధికార కేసీఆర్ పాలన అంటే విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో కనిపించిందంటూ ఒక ముక్కగా తేల్చేయటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు పక్కా అని.. మరో పాతిక సీట్లను కానీ తెచ్చుకుంటే పవర్ తమదేనని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇంతకీ టీడీపీ బలంగా ఉన్నట్లుగా రాహుల్ కు అందిన ఫలితాలకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టీడీపీ బలంగా ఉన్న 35 నియోజకవర్గాల లిస్టును సైతం రాహుల్ కు అందజేసినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ కాంగ్రెస్ చేయించిన సర్వేలో టీడీపీ అభ్యర్థుల గెలుపు పక్క అంటూ వండి వార్చిన కథనంగా కొందరు కాంగ్రెస్ నేతలు అభివర్ణిస్తున్నారు.
వైరల్ అవుతున్న టీడీపీ బలంగా ఉందని చెబుతూ పేర్కొనే జాబితాను చూస్తే
+ దేవరకద్ర
+ మక్తల్
+ వనపర్తి
+ జడ్చర్ల
+ షాద్ నగర్
+ పటాన్ చెరు
+ జహీరాబాద్
+ నిజామాబాద్ రూరల్
+ బోధన్
+ ఆర్మూర్
+ సిర్పూర్
+ ఖానాపూర్
+ జగిత్యాల
+ పెద్దపల్లి
+ నర్సంపేట్
+ ములుగు
+ వరంగల్ తూర్పు
+ భూపాలపల్లి
+ ఖమ్మం
+ కొత్తగూడెం
+ సత్తుపల్లి
+ మిర్యాలగూడ
+ హుజూర్ నగర్
+ తుంగతుర్తి
+ ఆలేరు
+ ఉప్పల్
+ ఎల్ బీ నగర్
+ రాజేంద్రనగర్
+ శేరిలింగంపల్లి
+ కూకట్ పల్లి
+ కుత్బుల్లాపూర్
+ ముషీరాబాద్
+ సనత్ నగర్
+ ఖైరతాబాద్
+ జూబ్లీహిల్స్