టీడీపీ ఖ‌మ్మం స‌భ‌.. తెలంగాణ‌లో గుబులు రేపుతోందే...!

Update: 2022-12-23 04:28 GMT
రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు కొద‌వ‌లేదు. నాయ‌కులు త‌లుచుకోవ‌డ‌మే ఆల‌స్యం.. ఈ ప‌రిణామాన్నయి నా సెంటిమెంటుగా మ‌లుచుకుని త‌మ‌కు అనుకూలంగా మార్చేసుకుంటారు.

ఇప్పుడు.. తెలంగాణ‌లోనూ మ‌ళ్లీ నాయ‌కులు ఇదే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ‌లోకి తాజాగా అంటే.. 2018 త‌ర్వాత‌.. ఎంట్రీ ఇచ్చిన‌.. చంద్ర‌బాబు రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత‌.. రెండు తెలుగు రాష్ట్రాల‌ను క‌ల‌ప‌డంఅసాధ్య‌మ‌ని వ్యాఖ్యానించారు.

ఇదిఏపీ నేత‌ల‌కు కౌంట‌ర్‌గానేకాకుండా.. తెలంగాణ‌లోనూ త‌న పార్టీని పుంజుకునేలా చేసేందుకు చంద్ర బాబు చాలా వ్యూహాత్మ‌కంగా వేసిన ఎత్తుగ‌డ‌. నిజానికి చంద్ర‌బాబే ఇలా వ్యాఖ్యానించిన త‌ర్వాత‌.. ఇక‌, టీఆర్ ఎస్ నేత‌ల‌కు వాయిస్ లేకుండా పోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.కానీ, అనూహ్యంగా దీనినికూడా వారు సెంటిమెంటుగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. తెలంగాణ మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించారు. ఏపీ ర‌క్తాన్ని న‌ర‌న‌రాన నింపుకొన్న చంద్ర‌బాబు .. ఇప్పుడు తెలంగాణ‌పై క‌న్నీరు కారుస్తున్నార‌ని కూడా అన్నారు. చంద్ర‌బాబు కూడా.. బీజేపీ మ‌నిషేన‌ని..ఆయ‌న‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని తాజాగా ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ ప‌రిణామం గ‌మ‌నిస్తే..చంద్ర‌బాబు ఎక్క‌డ త‌మకు పోటీ వ‌స్తారోన‌నే ఆవేద‌న‌, ఆందోళ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఇక, సీఎం కేసీఆర్ పేషీ కూడా ఇదే త‌ర‌హా ఆందోళ‌న‌లో ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. వెంట‌నే రంగంలోకి దిగిన ఆయ‌న కుమార్తె ఎమ్మెల్సీ కూడా ఆకాశంలో చంద్రుడితో కేసీఆర్‌ను పోల్చి.. తెలంగాణ‌కు చంద్ర‌డు ఒక్క‌డే అంటూ.. కామెంట్ చేశారు.

అంటే.. చంద్ర‌బాబు  రాక‌.. ఖ‌మ్మం స‌భకు వ‌చ్చిన రెస్పాన్స్ రెండూ కూడా..  ఖ‌చ్చితంగాఅధికార పార్టీలో గుబులు పుట్టిస్తోంద‌నే వ్యాఖ్య‌ల‌ను నిజం చేస్తున్నాయి. మ‌రి మున్ముందు చంద్ర‌బాబు ఎలాదూసుకుపోతారో.. కేసీఆర్ ఎలా చెక్ పెడ‌తారో.. చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News