ఏపీ రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతుడైన నేతగా చలమలశెట్టి సునీల్ పేరు వినిపిస్తోంది. 2014 నుంచి వైసీపీ తరుఫున గట్టిగా ప్రతిపక్షంలో పోరాడారు. 2019లో ఈజీగా గెలుస్తాడని అనుకున్నారు. కానీ హఠాత్తుగా టీడీపీలో చేరాడు. ఎంపీ టికెట్ తెచ్చుకొని వైసీపీ గాలిలో కొట్టుకుపోయి ఓడిపోయాడు. వైసీపీలో ఉంటే ఇప్పటికీ ఎంపీ అయి ఉండేవాడు. హఠాత్తుగా మనసు మార్చుకొని ఓడిపోయాడు.
నిజానికి 2009లో ప్రజారాజ్యం తరుపున, 2014లో వైసీపీ తరుఫున ఇలానే ప్రజాభీష్టం తెలుసుకోకుండా పోటీచేసి ఓడిపోయారు.
తాజాగా మరోసారి చలమలశెట్టి సునీల్ వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చారు. తూర్పు గోదావరి వైసీపీ నేతలందరితో కలిసి వచ్చి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
కాగా వరుసగా ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ కు రాజ్యసభ సీటు హామీతోనే వైసీపీలో చేరినట్టు ప్రచారం సాగుతోంది. కాకినాడలో బలమైన నేతగా.. నేతల మద్దతుతోపాటు ఆర్థికంగా బలమైన సునీల్ కు వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.