నానీ, వంశీలు వేధిస్తున్నారు : టీడీపీ నాయ‌కురాలు ఫిర్యాదు

Update: 2022-06-12 09:59 GMT
కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీలు త‌న‌ను వేధిస్తున్నారంటూ.. ఓ మ‌హిళా నాయ‌కురాలు.. పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్ననాని, గ‌న్న‌వరం నుంచి విజ‌యంద‌క్కించుకుని.. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వంశీల‌పై ఆమె ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన మూల్పూరి క‌ళ్యాణి.. కొన్నాళ్లుగా పార్టీ త‌ర‌ఫున యాక్టివ్‌గా ఉంటున్నారు. చంద్ర‌బా బు పిలుపు మేర‌కు.. ఇక్క‌డ కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిం చాలని భావించారు. గ‌న్న‌వ‌రంలో ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద నివాళులు అర్పించేందుకు ప్ర‌య‌త్నించారు. దీనికి సంబంధించి విగ్ర‌హాన్ని డెక‌రేష‌న్ చేసేందుకు ఆర్డ‌ర్ కూడా ఇచ్చారు. అంతా స‌వ్యంగా జ‌రుగుతుంద ని భావించిన త‌రుణంలో వైసీపీ నేత‌ల నుంచి తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు ప్లెక్సీల‌తో క‌ప్పేశారు. ఇది తీవ్ర వివాదంగా మారింది.

ఈ క్ర‌మంలో క‌ళ్యాణి.. వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి.. తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ నుంచి రాజ‌కీయంగా ఎదిగిన నాయ‌కులు.. ఇప్పుడు అదే ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని అడ్డుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే వంశీ, మాజీ మంత్రి కొడాలి నానీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. క‌ళ్యాణి విమ‌ర్శ‌ల‌పై.. వైసీపీ నాయ‌కులు.. సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకునితీవ్ర‌స్థాయిలో విష ప్ర‌చారం చేశారు. ఆమెపై అత్యంత అబ్యంత‌ర వ్యాఖ్య‌ల‌ను పోస్టు చేశారు.

క‌నీసం మ‌హిళ అని కూడా చూడ‌కుండానే.. ఆమెపై ద్వంద్వార్థ ప‌దాలు.. వికృత వ్యాఖ్య‌ల‌తో సోష‌ల్ మీడి యాలో పోస్టులు పెట్టారు. కేవ‌లం వైసీపీ నేత‌లే కాకుండా.. వైసీపీ సానుభూతి ప‌రుల‌తో కూడా క‌ళ్యాణిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయించారు. దీనిపై క‌ళ్యాణి.. పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. త‌న‌ను తిట్టిపోయిస్తూ.. అస‌భ్య ప‌దాల‌తో దూషిస్తున్నార‌ని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. మ‌రి దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News