ఎమ్మెల్యే గ‌ద్దె `ఫార్ములా` బాగుందే.. ఫాలో అవుతారా?

Update: 2021-03-29 15:30 GMT
ఎవ‌రు ఒప్పుకొన్నా.. ఒప్పుకోక‌పోయినా.. ఏపీలో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. కీల‌క‌మైన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో పార్టీ ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిగా మారింది. 2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుం టుంద‌ని... ఓట‌మితో నాయ‌కులు ‌క‌లుసుకుని ప‌నిచేస్తార‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే నేత‌ల‌ను సంతృప్తి ప‌రిచేందుకు చంద్ర‌బాబు సైతం ప‌ద‌వుల పందేరం చేశారు. కీల‌క‌మైన ప‌ద‌వులు సృష్టించి మ‌రీ నాయ‌కుల‌కు ఇచ్చారు. అయితే.. స్థానిక ఎన్నిక‌ల్లో త‌మ్ముళ్లు ఏమేర‌కు క‌లిసి ప‌నిచేశారో.. అంద‌రికీ తెలిసిందే. ఇక, ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక వ‌చ్చింది. మ‌రి ఇక్క‌డైనా క‌లిసి ప‌నిచేస్తారా? అనేది ప్ర‌శ్న‌గా మారింది.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, సీనియ‌ర్ టీడీపీ నాయ‌కుడు గ‌ద్దె రామ్మోహ న్‌... ఓ ఫార్ములాను ప్ర‌క‌టించారు. టీడీపీకి పున‌ర్వైభ‌వం తెచ్చేందుకు ఈ ఫార్ములా ప‌నిచేస్తుంద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. రామ్మోహ‌న్ మాట‌ల ప్ర‌కారం.. కార్యకర్తలందరూ ఏకతాటిగా ముందుకు వెళితే తెలుగుదేశానికి పూర్వవైభవం ఖాయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌, కార్పొరేటర్‌ శ్వేత ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీ మళ్లీ తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేంత వరకు నిద్రపోకూడదని...అందుకు క్షేత్రస్ధాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాతే పేదవాళ్లకు, బలహీనవర్గాలకు ఒక దారి దొరికిందన్నారు. దాని ఫలితాలే ఇప్పటి వరకు అందరూ అనుభవిస్తున్నారని తెలిపారు. మొదటి నుంచి పార్టీలో అనేక మంది వలస వెళ్లారు.. వచ్చారన్నారు. కె.ఆర్‌. నారాయణ్‌, అబ్ధుల్‌ కలాం వంటి ఆదర్శవంతులను రాష్ట్రపతులను చేయటంలో పాత్ర కూడా తెలుగుదేశం పార్టీయే అని గద్దె రామ్మోహన్ తెలిపారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. గ‌ద్దె ఫార్ములా ను పాటించేది ఎంత‌మంది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. వివాద ర‌హితుడు, ఎలాంటి ఆరోప‌ణ‌లు లేని నాయ‌కుడే అయినా.. గ‌ద్దె వంటి నేత‌ల మాట‌లు వ‌ర్కువుట్ అవుతాయా? చూడాలి.




Tags:    

Similar News