ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు తరచూ రోడ్ల ప్రమాదాలకు గురి కావటం జరుగుతోంది. కొన్నిసార్లు తీవ్రగాయాలు.. మరికొన్ని సందర్భాల్లో మృత్యువాత పడటం తెలిసిందే. తాజాగా ఒక పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గౌతు శీరీష. వేగంగా వెళుతున్న కారులో ప్రయాణిస్తున్న ఆమె తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూర్ గామ్ వైపు వెళుతున్న ఆమె ప్రయాణిస్తున్న కారు లారీని తప్పించబోయి.. డివైడర్ ను బలంగా ఢీ కొన్నారు. అదృష్టవశాత్తు ఆమె సీటు బెల్టు పెట్టుకోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వేగంగా ప్రయాణించటమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.