మీ మాట‌తోనే ఎక్కువ న‌ష్టం కుటుంబ‌రావుగారూ!

Update: 2019-04-25 05:07 GMT
రాజ‌కీయాలు అన్నాక స‌వాల‌చ్చ ఉంటాయి. మాటా.. మాటా అనుకోవ‌టం మామూలే. కాకుంటే.. హ‌ద్దులు దాట‌ని రీతిలో మాట‌లు అనుకోవ‌టం పెద్ద స‌మ‌స్య కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల‌కొన్న ప్ర‌త్యేక రాజ‌కీయాల నేప‌థ్యంలో అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య త‌ర‌చూ మాట‌ల యుద్ధం సాగే విష‌యం తెలిసిందే.

టీడీపీ నేత‌.. ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు కుటుంబ‌రావుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత విజ‌య‌సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. కుటుంబ‌రావును ఆయ‌న బ్రోక‌ర్ గా పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీనికి బ‌దులిచ్చిన కుటుంబ‌రావు.. అవును.. నేను బ్రోక‌ర్ని.. స్టాక్ బ్రోక‌ర్ని అంటూ రియాక్ట్ అయిన తీరు కొత్త‌గా ఉంద‌ని చెప్పాలి.

ఎవ‌రైనా ఒక‌రు కించ‌ప‌రిచేలా మాట్లాడితే.. దానికి కౌంట‌ర్ స‌మ‌ర్థవంతంగా ఇవ్వాలి. అంతేకాదు.. కించ‌ప‌రిచే మాట‌తోనే స‌మాధానం చెప్ప‌టం వ‌ల్ల మిస్ ఫైర్ అయ్యే అవ‌కాశం ఉంది.తాజాగా కుటుంబ‌రావు ఎపిసోడ్ లోనూ ఇదే జ‌రిగింద‌ని చెప్పాలి. కుటుంబ‌రావును ఉద్దేశించి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్లో చేసిన వ్యాఖ్యతో జ‌రిగిన డ్యామేజ్ కంటే.. త‌న‌కు తానే బ్రోక‌ర్ని.. స్టాక్ బ్రోక‌ర్ని అంటూ చెప్పుకునే మాటతోనే ఎక్కువ న‌ష్ట‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాను స్టాక్ బ్రోక‌ర్ గా 15 ఏళ్లు ప‌ని చేశాన‌ని.. ఆ ప‌ని చేయ‌టం త‌ప్పు కాద‌న్నారు. స్టాక్ బ్రోక‌ర్ గా కుటుంబ‌రావు ప‌ని చేయ‌టాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌టం లేద‌ని.. రాజ‌కీయ నేత‌గా షిఫ్ట్ అయ్యాక ఆయ‌న చేస్తున్న ప‌నుల‌తోనే త‌మ‌కు పంచాయితీ అంతా? అని వ్యాఖ్యానిస్తున్నారు. తాను ఎప్పుడూ ఆర్థిక శాఖ స‌మావేశాల్లో పాల్గొన‌లేద‌ని.. తాను 12 క‌మిటీల్లో స‌భ్యుడిగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షునిగా త‌న‌కు ఆహ్వానం ఉన్న మీటింగ్స్ కు మాత్ర‌మే తాను అటెండ్ అవుతున్న‌ట్లు చెప్పారు. త‌న‌ను ఉద్దేశించి బ్రోక‌ర్ అంటూ చేసిన వ్యాఖ్య‌ల్ని విజ‌య‌సాయిరెడ్డి వెన‌క్కి తీసుకోవాల‌న్నారు. మ‌రి.. దీనికి విజ‌య‌సాయిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
 
Tags:    

Similar News