కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పెను సంచలనాలకు వేదికైపోయింది. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికను అటు అధికార టీడీపీతో పాటు ఇటు విపక్ష వైసీపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఇప్పుడు అక్కడ ప్రచార హోరు మారుమోగిపోతోంది. దాదాపు పది రోజులకు పైగా నంద్యాలలోనే తిష్ట వేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గంలోని దాదాపు ప్రతి ఓటరు ఇంటి తలుపునూ తట్టారన్న వాదన వినిపిస్తోంది. ఫలితంగా అప్పటిదాకా టీడీపీకి ఫేవర్ గా ఉన్న ఓటరు నాడి కాస్తా... వైసీపీ వైపు తిరిగిందట.
అయితే ఎలాగైనా నంద్యాలలో వైసీపీని ఓడించాల్సిందేనన్న భావనతో అధికార దండాన్ని చేతుల్లోకి తీసుకున్న టీడీపీ సర్కారు... నంద్యాలలో పలువురు నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంది. అంతేకాకుండా... నంద్యాల ఫలితాన్ని ప్రభావితం చేస్తారని భావిస్తున్న ముస్లింల ఓటు బ్యాంకును రాబట్టుకునేందుకు... అప్పటిదాకా పక్కనపెట్టిన మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత ఎన్ ఎండీ ఫరూక్ కు ఆఘమేఘాల మీద ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసింది. అంతేకాదండోయ్... ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తే... నంద్యాలకు చెందిన ముస్లిం నేతకు శాసనమండలి చైర్మన్ గిరీ కూడా ఇస్తానంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరో తాయిలం కూడా ప్రకటించేశారు.
వెరసి భూమా కుటుంబానికి ఓటేస్తే... ఫరూక్ కు మరో బంపర్ ఖాయమేనన్న మాట. ఈ క్రమంలో ఫరూక్ శక్తివంచన లేకుండా నంద్యాలను చుట్టేస్తున్నారు. ఇప్పుడు అక్కడ టీడీపీ గెలుపు భూమా ఫ్యామిలీ కంటే కూడా ఫరూక్ కే ఎక్కువ అవసరమన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఫరూక్ కు భారీ షాకిస్తూ... స్వయానా ఆయనకు మేనల్లుడైన ముస్తాక్ వైసీపీలో చేరిపోయారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైనే నేడు ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాలోనే కాకుండా తెలుగు నేలలో పలు ప్రాంతాల్లో హరూన్ మోటార్స్ పేరిట పేరున్న పారిశ్రామికవేత్తగా ఎదిగిన ముస్తాక్... నేటి ఉదయం నంద్యాల ప్రచారంలో బిజీగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా వైసీపీలో చేరాలనుకుంటున్నానని చెప్పిన ముస్తాక్ మాటకు హర్షం వ్యక్తం చేసిన జగన్... ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముస్తాక్ మాట్లాడుతూ.. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే... నంద్యాలలో ప్రముఖ కళాశాలగా పేరున్న రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ అధినేత రామకృష్ణారెడ్డి కూడా వైసీపీకి మద్దతు ప్రకటించారు.