ఒక్క పదవి.. టీడీపీలో చిచ్చుపెట్టింది..!

Update: 2019-07-25 07:37 GMT
ఉన్నది ఒకటే ఒక్క కేబినెట్ ర్యాంకు పదవి. ఐదేళ్లు అధికారం లేకుండా ఉండాలి. అది నేతలకు వల్ల కాదు కదా.. అందుకే ఆ ఒక్క పదవి కోసం ఎగబడ్డారు.. బెదిరించారు. అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ ఒక్క పదవిని పోయిన సారి గెలవలేని.. అస్సలు పదవులు అనుభవించిన సీనియర్ ఎమ్మెల్యే  పయ్యావుల కేశవ్ కు కట్టబెట్టాడు. ఇప్పుడు ఇదే టీడీపీలో చిచ్చు పెట్టిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి..

టీడీపీ రాష్ట్రంలో గెలిచినప్పుడు పయ్యావుల కేశవ్ ఓడిపోతుంటారు. అది ఆయనకు శాపంగా మారుతోంది. మంత్రిగా చేయాలనుకున్న ఆయన కల నెరవేరడం లేదు. ఈసారి టీడీపీ అధికారంలోకి రాలేదు. కానీ కేశవ్ గెలిచాడు. అందుకే పయ్యావుల కేశవ్ ముచ్చట తీర్చడానికి చంద్రబాబు ఆయనకు వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇచ్చే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్(పీఏసీ) చైర్మన్ పదవికి ఎంపిక చేశారట.  ఈ ఎంపికతో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయని సమాచారం.

చంద్రబాబు పీఏసీ చైర్మన్ పదవిని బీసీ - లేదా కాపు సామాజికవర్గానికి ఇస్తారనుకొని అచ్చెన్నాయుడు - గంటా - బుచ్చయ్య చౌదరి సహా మరికొందరు కీలక నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ సడన్ గా చంద్రబాబు అసెంబ్లీలో ఏమాత్రం చురుకుగా ఉండని పయ్యావులకు కట్టబెట్టడంపై వారంతా గుర్రుగా ఉన్నారు. బాబు తీరుపై సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట..

గంటా శ్రీనివాసరావు తనకు ఆ పదవి ఇవ్వకపోతే బీజేపీలో చేరుతానని బెదిరించినట్టు వార్తలు వచ్చాయి. ఆయన పార్టీలోనూ యాక్టివ్ గా ఉండడం లేదు.పార్టీ మారుతారని అనుకుంటున్న గంటాను కాదని చంద్రబాబు తనకు నమ్మకస్తుడైన కేశవ్ కు పదవి ఇచ్చారని సమాచారం.

అయితే చంద్రబాబు కమ్మ సామాజికవర్గమే  కేశవ్ కావడం టీడీపీలో దుమారానికి కారణమైంది. పదవులన్నీ అగ్ర సామాజికవర్గానికేనా అని ఇతర నేతలు ఆక్రోశపడుతున్నారట.. అసెంబ్లీలో ఎంతో ఫైట్ చేస్తున్న తమను వాడుకొని కీలక పదవిని మాత్రం ఇవ్వరా అని వారంతా చంద్రబాబుపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
Tags:    

Similar News