చూపుడువేలితో ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపించేటప్పుడు... మిగిలిన నాలుగువేళ్లూ మనవైపే ఉంటాయని.. అలాంటి తప్పులు.. మనలో ఏమైనా ఉన్నాయో లేదో.. ఆత్మసమీక్ష కూడా అవసరం అని పెద్దలు అంటూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందిస్తున్న తీరును గమనిస్తోంటే ఈ నీతి గుర్తుకు వస్తోంది. తెలంగాణ లోని కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను భారీ స్థాయిలో నిర్వహించింది. ఇప్పటిదాకా కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవోపేతంగా దాదాపు 60 కోట్లు దాటిన భారీ ఖర్చుతో వీటిని నిర్వహించారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిచినప్పుడు సహజంగానే అందులో అనేక పొరబాట్లు కూడా దొర్లాయి. వాటిని గురించి విమర్శలు కూడా వచ్చాయి.
అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ వారికి మాత్రం.. నిర్వహణలో పాలు కూడా కళ్లకు కనిపించడం లేదు. వారికి కావాల్సినదెల్లా.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు ఈ తెలుగు సభల్లో పెద్దపీట వేయకపోవడం గురించిన చింత మాత్రమే. ఎన్టీఆర్ ను స్మరించుకోకుండా అసలు తెలుగు మహాసభలా.. అవేం సభలు అంటూ తె-తెదేపా నాయకులు బుగ్గలు నొక్కుకుంటున్నారు.
అయినా తెలుగుభాషకు.. ఎన్టీఆర్ కు భాషతో ఉండే అనుబంధానికి అంతగా పెద్దపీట వేయాలని ఉంటే గనుక.. తెలుగుదేశం ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకంటె వైభవంగా నిర్వహించవచ్చు కదా.. లేదా తెలుగుదేశం మహానాడు తరహాలోనే.. భాషా సదస్సులను కూడా పార్టీ ఆధ్వర్యంలోనే నిర్వహించవచ్చు కదా.. అనే సందేహాలు సామాన్యులకు సహజంగానే కలుగుతున్నాయి.
తెతెదేపా నాయకులు ఎన్టీఆర్ చిత్ర పటం గురించే రాద్ధాంతం చేస్తున్నారంటే ఈ సభల నిర్వహణలో ఇతరత్రా లోపాలేమీ వాళ్లకు తప్పుల కింద కనిపించడం లేదన్నమాట.. అంటే సభలు విపరీతంగా సక్సెస్ అయ్యాయన్న మాట అని భాష్యాలు చెప్పేవారు కొందరు. ఇదిలా ఉండగా పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా.. పని చేసే వారికే విమర్శలు కూడా వస్తుంటాయి. తెలుగు భాషకు గౌరవం దక్కేలాగా సభలు నిర్వహించినందుకే కేసీఆర్ ను ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు.. అదే చంద్రబాబు లాగా.. అసలు సభలూ గట్రా ఏమీ లేకుండా.. ఓ మూలన కూర్చుని ఉంటే విమర్శలు కూడా వచ్చేవి కాదు కదా.. అని మాటలతో ఎదురుదాడి చేస్తున్న వారు కూడా ఉన్నారు.