తాను చేసే ప్రతి పనిని మైలేజీ రూపంలో లెక్క కట్టటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మించినోళ్లు మరొకరు కనిపించరు. చివరకు తన కార్యాలయం విడుదల చేసే ప్రెస్ నోట్ తో ఎంత ప్రయోజనం కలుగుతుందన్న విషయాన్ని బాబు ఆలోచిస్తారని ఆయన సన్నిహితులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుంటారు. మరి.. ఇలాంటి బాబు తాజాగా తన ఢిల్లీ టూర్ కు సంబంధించి తన అనుకూల మీడియాలో చాలా గొప్పలు రాయించేసుకుంటున్నారు.
బాబు ఢిల్లీ టూర్ తో ఏదో జరగనుందన్న భావనను కలిగించేందుకు వీలుగా జనం మీద లక్షలాది అక్షరాల్ని కుమ్మరిస్తున్న పరిస్థితి. విభజన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటికి 29సార్లు ఢిల్లీ టూర్లు చేసిన బాబు.. తాజాగా తన 30 టూర్ కు రంగం సిద్ధం చేశారు. అధినేత ఢిల్లీ టూర్ కు ముందు ఢిల్లీలోని తెలుగు తమ్ముళ్లకు ఊపిరి సలపనంత పనితో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బాబు ఢిల్లీ టూర్ అయితే.. తమ్ముళ్లకు అంత హడావుడి ఎందుకు? అంటారా? అక్కడే ఉంది అసలు విషయమంతా.
హోదా వాణిని బలంగా వినిపిస్తున్న బాబుపై మోడీ కత్తి కట్టారని.. ఏదో చేయనున్నట్లుగా ఢిల్లీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయం బాబు చెవిన పడింది. దీనికి చెక్ పెట్టేందుకు వీలుగా తమ్ముళ్లను అలెర్ట్ చేసిన బాబు.. మోడీ బ్యాచ్ కు వ్యతిరేకంగా జట్టు కట్టే అవకాశాల్ని పరిశీలించాలని కోరారు. కూటమి కట్టినా కట్టకున్నా.. పలు రాష్ట్రాల విపక్ష నేతలతో భేటీ కావటం ద్వారా తాను మోడీ వ్యతిరేక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని జాతీయస్థాయిలో అర్థమయ్యేలా చెప్పాలన్నది బాబు ప్లాన్ గా చెబుతున్నారు.
ఇందులో భాగంగా తాను ఢిల్లీలో అడుగు పెట్టే నాటికి.. తీరిక లేని షెడ్యూల్ ను సిద్ధం చేయమని చెప్పినట్లుగా తెలిసింది. ఎన్ని పార్టీలు వీలైతే అన్ని పార్టీల అధినేతలను.. ఒకవేళ కుదరని పక్షంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలతో భేటీ అయ్యేటట్లుగా ఏర్పాట్లు చేయాలన్న స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
దీనికి తగ్గట్లే.. ఢిల్లీలోని తెలుగు తమ్ముళ్లు గడిచిన మూడు నాలుగు రోజులుగా ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. పలు పార్టీలకు చెందిన నేతల్ని కలిసి.. తమ అధినేత భేటీ కావాలని కోరుకుంటున్నట్లుగా వివరించి.. వారి అపాయింట్ మెంట్లు ఫిక్స్ చేసే పనిలో తలమునకలై ఉన్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు తానెంత కీలకంగా మారానన్న విషయాన్ని జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చేలా ఆయన ప్లాన్ ఉందంటున్నారు. ఇందుకోసమే బాబు ఢిల్లీ 30 టూర్ ఉద్దేశమని తెలుస్తోంది. మోడీపై బాబు ఎంతలా కత్తి దూస్తున్నారో చూస్తున్నారా? అన్నట్లుగా బాబు బిహేవియర్ ఈసారి ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా బాబు ఢిల్లీ టూరేమో కానీ.. తెలుగు తమ్ముళ్లకు చేతి నిండా పని లభించిందని చెప్పక తప్పదు.